ఏపీలో మరో జాబ్ నోటిఫికేషన్ .. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Recommended Video

    Grama Volunteer Posts : Latest Notification For 9,674 Posts In Andhra Pradesh || Oneindia Telugu

    ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ నిరుద్యోగ యువతకు మరోమారు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ పధకాలు ప్రజల దగ్గరకి నేరుగా చేరాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఇటీవల కాలంలో గ్రామ వాలంటీర్ పోస్ట్ లను, సచివాలయ ఉద్యోగాల భర్తీ చేపట్టి ఉపాధి అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు మిగిలిపోయిన గ్రామవాలంటీర్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.

    విభిన్న కారణాలతో ఖాళీ అయిన పోస్టుల భర్తీకి తాజాగా ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఈ దఫా లో 13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో మరో 9 వేల 674 మందికి ఉపాధి అవకాశం కలగనుంది.నోటిఫికేషన్ విడుదల చేసిన గ్రామ వాలంటీర్ పోస్టులకు సంబంధించి నవంబరు 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

    Another job notification .. good news to unemployed

    అభ్యర్థులు నవంబరు 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ఇక నవంబరు 15 నుంచి దరఖాస్తుల పరిశీలన జరుపుతారని, ఆ తరువాత నవంబరు 16 నుంచి 20 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని తెలుస్తుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు డిసెంబరు 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రిజర్వేషన్ల ఆధారంగా పోస్టుల భర్తీ ఉంటుందని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. దీంతో మరికొంత మంది నిరుద్యోగులకు గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల ద్వారా ఉపాధి దొరకనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+