ఢిల్లీ బిల్లుపై అలా తేల్చేసిన చంద్రబాబు-బీజేపీతో పొత్తు వేళ కీలక నిర్ణయం..!

దేశ రాజధానిపై పట్టు కోసం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య సాగుతున్న పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో సేవలపై రాష్ట్ర ప్రభుత్వానికే హక్కు ఉంటుందంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడంతో దీన్ని కౌంటర్ చేసేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్రం .. నిన్న లోక్ సభలో బిల్లు కూడా ప్రవేశపెట్టింది. దీనిపై ఇప్పటికే ఎన్డీయే పార్టీలతో పాటు కేంద్రానికి పరోక్షంగా మద్దతిస్తున్న పార్టీలు కూడా సమర్ధిస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో పార్టీలపై అందరి దృష్టీ పడింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీతో పాటు కేంద్రంతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ ఢిల్లీ బిల్లుకు అండగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రధాని మోడీ, అమిత్ షా కు కూడా తెలియజేసింది. ఇక మిగిలింది విపక్ష పార్టీ టీడీపీ. కానీ ఈసారి టీడీపీ అంత త్వరగా తేల్చలేదు. కర్నాటక ఎన్నికల తర్వాత దక్షిణాదిన మారుతున్న పరిస్ధితులు, ఉత్తరాదిన కూడా ఈసారి కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటోందన్న సంకేతాలతో ఢిల్లీ బిల్లుపై వెంటనే మద్దతిచ్చేందుకు సిద్ధపడలేదు. దీంతో ఢిల్లీ బిల్లుపై టీడీపీ ఏం చేయబోతోందన్న చర్చ మొదలైంది.

another setback to arvind kejriwal as chandrababu extends support to delhi bill

కానీ ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఢిల్లీ బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లక్ సభలో తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలతో ఢిల్లీ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ వేయించాలని నిర్ణయించారు. దీంతో చంద్రబాబు మద్దతుపై చివరి నిమిషం వరకూ ఆశలు పెట్టుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చివరకు కాంగ్రెస్ మద్దతు కూడా తీసుకోవడంలో సక్సెస్ అయిన కేజ్రివాల్ కు చంద్రబాబు మాత్రం షాకిచ్చారు.

లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు, రాజ్యసభలో ఒక ఎంపీ కలిగిన టీడీపీ .. ఢిల్లీ బిల్లుపై కేంద్రానికి మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా పెద్దగా తేడా ఉండదు. కానీ బీజేపీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీడీపీకి ఈ మద్దతు ప్రకటన కీలకంగా మారింది. బీజేపీకి అవసరం లేకపోయినా గతంలో పలుమార్లు మద్దతిచ్చిన టీడీపీ.. మరోసారి అలాంటి ప్రయత్నమే చేసింది. తద్వారా గతంలో కాదన్న బీజేపీకే మరోసారి మద్దతుగా ఉండటం ద్వారా భవిష్యత్ రాజకీయాలకు చంద్రబాబు పదునుపెడుతున్నారు.
టీడీపీ నిర్ణయంతో ఏపీలో అధికార, విపక్షాలు ఢిల్లీ బిల్లుకు మద్దతిచ్చినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+