చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఇలాకాలో జగన్‌కు రెండో షాక్: పెద్దిరెడ్డి-మిథున్ రెడ్డిలకు దెబ్బ, టిడిపి చక్రం

చిత్తూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసిపికి చెందిన పీలేరు జెడ్పీటీసీ సభ్యుడు మల్లెల రెడ్డి భాషా శనివారం రాత్రి టిడిపిలో చేరారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసిపికి చెందిన పీలేరు జెడ్పీటీసీ సభ్యుడు మల్లెల రెడ్డి భాషా శనివారం రాత్రి టిడిపిలో చేరారు.

'అమరావతి'పై బాబు బెదిరింపులో ట్విస్ట్, వైసిపి నేత ఇంట్లో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు'అమరావతి'పై బాబు బెదిరింపులో ట్విస్ట్, వైసిపి నేత ఇంట్లో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు

మంత్రి అమర్నాథ్ రెడ్డి నివాసంలో ఆయన పసుపు పచ్చ కండువా కప్పుకున్నారు. మంత్రి, టిడిపి జిల్లా అధ్యక్షులు నానిలు ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

నంద్యాల నిదర్శనం

నంద్యాల నిదర్శనం

ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు టిడిపి వైపు ఆకర్షితులవుతున్నారని, దీనికి నంద్యాల ఫలితమే నిదర్శనమని మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం మైనార్టీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అందుకే ముస్లింలు టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.

టిడిపిలోకి జెడ్పీటీసీలు, ఎంపీపీలు

టిడిపిలోకి జెడ్పీటీసీలు, ఎంపీపీలు

వైసిపి నుంచి టిడిపిలోకి చేరికల ఒరవడి కొనసాగుతుందని మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. రాబోయే రెండు నెలల్లో చిత్తూరు జిల్లాలోని మరింత మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు టిడిపిలో చేరనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని తెలిపారు.

జగన్ పార్టీకి రెండో షాక్

జగన్ పార్టీకి రెండో షాక్

పీలేరు నియోజకవర్గంలో టిడిపి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జడ్పీటీసీ సభ్యుడు రెడ్డి బాషా చెప్పారు. కాగా, గత ఏడాది గుర్రంకొండ జెడ్పీటీసీ రెడ్డి రాజా వైసిపికి గుడ్ బె చెప్పి, టిడిపిలో చేరారు. ఇప్పుడు రెడ్డి భాషా చేరారు. ఏడాదిలో వైసిపికి ఇది రెండో షాక్.

టిడిపి బలహీనపడుతున్న సమయంలో..

టిడిపి బలహీనపడుతున్న సమయంలో..

పీలేరు నియోజవకర్గంలో వైసిపి తరఫున పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రాబల్యం బలంగా ఉంది. దీంతో గత ఎన్నికల నాటి నుంచి నియోజకవర్గంపై వైసిపికి బలమైన స్థానంగా మారింది. క్రమంగా టిడిపి బలహీనమైంది. టిడిపిలోని వర్గ విభేదాలు కూడా ఓ కారణం.

జగన్‌కే కాదు, మిథున్ రెడ్డి, చింతలకు గట్టి షాక్

జగన్‌కే కాదు, మిథున్ రెడ్డి, చింతలకు గట్టి షాక్

అనంతరం పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరారు. దీంతో పరిస్థితి తారుమారవుతూ వస్తోంది. పీలేరుపై దృష్టి సారించారు. వైసిపి నుంచి బలమైన స్థానిక నేతలను టిడిపిలో చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. పైగా ముస్లీం మైనార్టీలు అధికంగా ఉన్న పీలేరులో ఈ పరిణామం వైసిపికి, ముఖ్యంగా చింతల, మిథున్ రెడ్డిలకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు.

మరికొంతమందిని టిడిపిలోకి తెచ్చే వ్యూహాలు

మరికొంతమందిని టిడిపిలోకి తెచ్చే వ్యూహాలు

ఇంతటితో ఆగదని, మంత్రి అమర్నాథ్ రెడ్డి, జిల్లా అద్యక్షులు నానిలు మరికొంతమంది వైసిపి ముఖ్య నేతలను టిడిపిలోకి తీసుకు వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది.

English summary
Another ZPTC joined Telugu Desam Party from YSR Congress Party in Chittoor district on Saturday in the presence of minister Amarnath Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X