AP 12th PRC: ఏపీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్..! పీఆర్సీపై మరో అప్డేట్..!

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు వేతన సవరణ సంఘం (AP 12th PRC) అమలుపై కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పీఆర్సీ కమిషనర్ ను నియమించిన కూటమి ప్రభుత్వం ఇవాళ మరో కీలక నియామకం చేపట్టింది. పీఆర్సీ అనుకున్న సమయానికి తమ నివేదిక ఇచ్చేందుకు వీలుగా, క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు తెలుసుకునేందుకు వీలుగా ఇవాళ కార్యదర్శిని కూడా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సచివాలయాల ఉద్యోగులకు వేర్వేరు పే స్కేల్స్ ఎందుకంటే ? సర్కార్ క్లారిటీ..!
సచివాలయాల ఉద్యోగులకు వేర్వేరు పే స్కేల్స్ ఎందుకంటే ? సర్కార్ క్లారిటీ..!

12వ వేతన సవరణ సంఘం (12th Pay Revision Commission) కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి. లక్ష్మీనరసింహంను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జీవో ఆర్టీ నంబర్ 2067 జారీ చేశారు. దీంతో 2003 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.లక్ష్మీనరసింహం తిరిగి ఉద్యోగంలో నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి నియామకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన పదవీకాలం వేతన సవరణ సంఘం ఛైర్మన్ పదవీకాలంతో సమానంగా ఉంటుంది.

AP 12th PRC Update Retired IAS Officer P Laxminarasimham Appointed Secretary
APSRTC తో ఉద్యోగుల చర్చలు విఫలం..! జేఏసీ కీలక ప్రకటన..!
APSRTC తో ఉద్యోగుల చర్చలు విఫలం..! జేఏసీ కీలక ప్రకటన..!

పీఆర్సీ కార్యదర్శిగా నియమితులైన లక్ష్మీనరసింహం జీత భత్యాలను 2018 ఏప్రిల్ 23న జారీ చేసిన ఆర్థిక శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 48లోని నిబంధనల ప్రకారం నిర్ణయించనున్నారు. అంటే ఆయన గతంలో చివరిగా పొందిన వేతనం నుంచి పెన్షన్ మొత్తాన్ని మినహాయించి వేతనం ఖరారు చేస్తారు. ఈ నియామకానికి సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 12వ వేతన సవరణ సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, భత్యాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పరిశీలించే ప్రక్రియలో భాగంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో కమిషన్ కార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో పీఆర్సీ కమిషనర్ గా మాజీ సీఎస్ దినేష్ కుమార్ ను నియమించిన ప్రభుత్వం, ఇప్పుడు కార్యదర్శిని కూడా నియమించడంతో వేతన సవరణ అధ్యయనం వేగంగా సాగబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+