ఆ పార్టీకి సీట్ల సునామీ: ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన లేటెస్ట్ ప్రీ పోల్ సర్వే

AP Assembly election 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్‌ను విడుదల చేయబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. దీని తరువాత ఇక గ్రామస్థాయిలో ప్రచార హోరు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో- ఉత్కంఠభరిత పోరు ఉండబోతోంది.

ఇడుపులపాయకు జగన్..

ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోయే రోజే- అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే రోజున కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించనున్నారు. అక్కడే తుది జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది.

AP Assembly election 2024 Poll strategy predicts the YSRCP will retain power

టీడీపీ కూటమి ఎఫెక్ట్..

టీడీపీ- జనసేన కూటమిలో బీజేపీ చేరిక తరువాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు సంభవించాయి?, ఈక్వేషన్లు ఎలా మారాయి? ఓటరు నాడి ఎలా ఉంది?, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ/కూటమి అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? అనే అంశాలపై పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ తాజాగా ప్రీ- పోల్ సర్వేను నిర్వహించింది. వాటి వివరాలను వెల్లడించింది.

జట్టు కట్టినా..

టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి కట్టినప్పటికీ.. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ అంచనా వేసింది. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ 118 నుంచి 128 స్థానాలను గెలచుకుంటుందని అభిప్రాయపడింది. లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా వైసీపీదే హవా. 17 నుంచి 19 స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయి.

టీడీపీ పరిస్థితేంటీ?

తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమికి అసెంబ్లీలో 47 నుంచి 57 స్థానాలు, లోక్‌సభలో ఆరు నుంచి ఎనిమిది సీట్లు దక్కుతాయని తెలిపింది. మరోసారి టీడీపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని ఈ ప్రీ పోల్ సర్వే స్పష్టం చేసింది. ఓటింగ్ శాతం కూడా భారీగా ఉండకపోవచ్చని తెలిపింది.

వైసీపీకే..

ఈ సర్వే ప్రకారం చూసుకుంటే- వైఎస్ఆర్సీపీకి 49 నుంచి 51 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయి. టీడీపీ కూటమికి పడే ఓట్లు 43 నుంచి 45 శాతం వరకు ఉండొచ్చు. ఇతరులు అయిదు నుంచి ఏడు మేర ఓట్ల శాతాన్ని దక్కించుకుంటాయి. ఎటు తిరిగీ వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తేల్చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+