ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్.. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజారిటీతో టిడిపి కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 164స్థానాలలో టీడీపీ కూటమి విజయం సాధించగా, కేవలం 11 స్థానాలలో వైసీపీ గెలిచింది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఘన విజయం సాధించిన టీడీపీ కూటమి ఏపీలో పాలనా పగ్గాలు చేపడుతుంది.

రేపే చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం
భారీ మెజారిటీతో గెలుపొందిన టిడిపి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం కాగా రేపు సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

AP assembly session from June 17th Gorantla Butchaiah Chowdary as protem speaker

జూన్ 17 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అలాగే ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇదే క్రమంలో జూన్ 17వ తేదీ నుండి వరుసగా జూన్ 20వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. మొత్తం నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగుతాయని చెబుతున్నారు.

ప్రొటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజును ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి కేటాయించగా, ఏపీలో 2024అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. ప్రొటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది...రెండవ రోజు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది.

AP assembly session from June 17th Gorantla Butchaiah Chowdary as protem speaker

అసెంబ్లీ సమావేశాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు
ఆ తర్వాత ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన కీలక హామీ అయిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏపీలో ఘోర పరాజయం పాలై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

తొలి సమావేశాలలో ఆ బిల్లు రద్దుపై ఆసక్తి
ఇక నాలుగు రోజులపాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాల పైన సభలో తీసుకునే పలు నిర్ణయాల పైన, ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారా రారా అన్నదానిపైన ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇక తొలి సమావేశాల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు పెట్టనున్న క్రమంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+