అసెంబ్లీ ప్రారంభం - టీడీపీ సభ్యుల అందోళన : స్పీకర్ ఆగ్రహం..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున ప్రతిపక్ష టీడీపీ జాబ్ క్యాలెండర్ పైన వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఉద్యోగ కల్పన పైన చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేసారు. ప్ల కార్డులు పట్టుకొని నినాదాలు చేసారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో..స్పీకర్ వారి పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని సభలో ఏం చర్చించాలో బీఏసీ సమావేశంలో డిసైడ్ చేద్దామని చెప్పారు. కానీ, టీడీపీ సభ్యులు స్లోగన్లు ఇస్తూ నిరసన కొనసాగించారు.

జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి..జాబ్ లెస్ చేసారని నినాదాలు చేసారు. టీడీపీ సభ్యలు నినాదాల పైన ఆర్దిక మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రశ్నోత్తరాలు చేపట్టాలని కరోనా సమయంలో టీడీపీ డిమాండ్ చేసిందని..ఇప్పుడు ప్రశ్నోత్తరాలు చేపడితే వారే సభను సాగనీయటం లేదని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యుల ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. బీఏసీ సమావేశం జరగక ముందే టీడీపీ సభలో గొడవ చేస్తోందని.. రాజధానితో అన్ని అంశాల పైన చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సమన్వయకర్త శ్రీకాంతరెడ్డి చెప్పారు. మంత్రి జోగి రమేష్ టీడీపీ ఎమ్మెల్యేల పైన మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇచ్చిన ఉద్యోగాల వివరాలను వెల్లడించారు. టీడీపీ నేతలే రాజకీయ నిరుద్యోగులుగా పేర్కొన్నారు.

AP Assembly Sessions begins with TDP members protest, Demand for discussion on job calender

తాము ప్రతిపక్ష నేత ఇంటి దగ్గరకు వచ్చాం.. సమాధానం అడిగామని..వాళ్లే పారపోయారని మంత్రి చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ముందుగా.. టీడీపీ సభ్యులు ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. వెంకటపాలెo గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన నారా లోకేష్, టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ తరువాత అసెంబ్లీకి బయల్దేరారు. నిరుద్యోగ సమస్యపై లోకేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేసారు. అసెంబ్లీ వద్ద టిడిపి శాసనసభ పక్షం నిరసన కు దిగింది. 2.30లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ ప్లకార్డుల ప్రదర్శిస్తూ ఆందోళన చేసారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ కి కాలినడకన నిరసన ర్యాలీ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+