అసెంబ్లీలో జగన్ స్థానం అక్కడేనా - తాజా నిర్ణయం..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు..24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం పూర్తి చేసారు. చంద్రబాబు సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక..తొలి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ 11 స్థానాలకు పరిమితం అయింది. అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కలేదు. టీడీపీ తరువాత జనసేనకు స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ,జనసేన ప్రభుత్వం లో ఉంది. మరి..జగన్ స్థానం ఏంటి. అసెంబ్లీలో ఏం జరగనుంది.
సభలో ఎవరెక్కడ
ఏపీలో మూడు పార్టీల కూటమి 164 స్థానాలు గెలిచింది. ఏకపక్ష విజయంతో ప్రతిపక్ష పార్టీ హోదా వైసీపీకి గల్లంతు అయింది. ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 స్థానాలు రావాలి. కానీ, వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కాయి. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. 2014లో ఇదే కూటమి పైన 67 స్థానాలతో గెలిచిన జగన్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారు. అసెంబ్లీ నిబంధనల మేరకు ప్రతిపక్ష బెంచ్ లు అప్పుడు కేటాయించారు. ఇప్పుడు అసెంబ్లీలో సాంకేతికంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు.

జగన్ స్థానం పై చర్చ
ప్రతిపక్ష నేత స్థానం జగన్ కు అధికారికంగా దక్కే ఛాన్స్ లేదని చెబుతున్నారు. దీంతో..అసెంబ్లీలో జగన్ స్థానం ఎక్కడ ఉంటుందనే చర్చ మొదలైంది. అసెంబ్లీలో ఇప్పుడు జగన్ తన పార్టీకి చెందిన 11 మంది తో కలిసి సాధారణ ఎమ్మెల్యే తరహాలోనే హాజరు కావాల్సి ఉంటుంది. జగన్ కు సహజంగా అధికార పార్టీకి ఎదురుగా ప్రతిపక్షానికి దక్కే సీటింగ్ ఇస్తారా లేదా అనేది స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జగన్ కు ఎక్కడ సీటింగ్ అనేది రాజకీయంగా చర్చ సాగుతోంది. వైసీపీకి తొలి వరుసలో కేటాయిస్తారా..లేక, మరో విధంగా నిర్ణయం ఉంటుందా అనేది సభలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
స్పీకర్ నిర్ణయం ఫైనల్
ఇక..అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లలో భాగంగా..పార్టీల కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. జనసేన పార్టీకి కొత్తగా జేఏఎస్ఎల్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి టీడీఎల్పీ కేటాయించిన కార్యాలయాన్ని జేఎస్ఎల్పీకి కేటాయించడం జరిగింది. 2014 లో వైఎస్సార్‌ఎల్పీకి కేటాయించిన కార్యాలయాన్ని బీజేఎల్పీకి కేటాయిస్తున్నారు. 2014లో బీజేఎల్పీకి కేటాయించిన కార్యాలయాన్ని వైయస్ఆర్ఎల్పీకి కేటాయించడం జరిగింది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది. సభ్యుల ప్రమాణ స్వీకారం..కొత్త స్పీకర్ ఎన్నిక జరగనుంది. సభకు జగన్ హాజరవుతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications