Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుతో పోలిస్తే నితీష్..ఏపీ స్పీకర్ షాకింగ్..!

కేంద్రంలో ఈసారి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ లేకపోతే కేంద్రంలో ఎన్డీయే మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కూడా మోడీ వీరిద్దరి విషయంలో పాజిటివ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే ఏపీ, బీహార్ కు ప్రతీ విషయంలోనూ నిధుల సాయం లభిస్తోంది. అలాగే చంద్రబాబు, నితీష్ కూడా పాత మిత్రులే.

అయితే తాజాగా ఓ విషయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయన్నపాత్రుడు అనూహ్యంగా వీరిద్దరి మధ్య పోలిక తెచ్చారు. ఓ కీలక విషయంలో వీరిద్దరినీ పోల్చిన అయ్యన్న.. ఇందులో చంద్రబాబే గొప్ప అన్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే అయిన అయన్నపాత్రుడు ఇలా చంద్రబాబును పొగడటంలో తప్పులేదు కానీ నితీష్ కుమార్ తో పోలిక తీసుకురావడమే ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇలా అయ్యన్న వీరిద్దరినీ పోల్చిన విషయం ఏంటో తెలుసా అసరా పెన్షన్లు.

ap assembly speaker ayyannapatrudu took dig at bihar cm nitish kumar with Chandrababu comparison

నిన్న రిపబ్లిక్ డే సందర్బంగా జెండా ఆవిష్కరణ తర్వాత చేసిన ప్రసంగంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తాను స్పీకర్ల సదస్సు కోసం బీహార్ వెళ్లానని, అక్కడ కేవలం 400 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని, కానీ చంద్రబాబు మాత్రం వృద్ధులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేలు పెన్షన్ ఇస్తున్నారని గుర్తుచేశారు.

పేదల కోసం చంద్రబాబు ఉదారంగా అమలు చేస్తున్న ఈ పథకాలపై అందరూ ఆలోచించి ప్రభుత్వానికి చేయూత ఇవ్వాలని అయ్యన్న కోరారు. తద్వారా చంద్రబాబుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. కానీ పరోక్షంగా నితీష్ తో పోలిస్తే చంద్రబాబు ఉదారంగా ఉన్నారని గుర్తుచేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+