టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు - పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ తో జనసేన పొత్తు అధికారికం అయింది. బీజేపీ తమతో కలిసి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. బీజేపీ స్పందన ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో బీజేపీ మాత్రం ఇప్పటికీ పవన్ ఎన్డీఏలో భాగస్వామిగానే చెబుతోంది. ఢిల్లీ పర్యటనకు పవన్ సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే పవన్ కల్యాణ్ నిర్ణయం పైన పురందేశ్వరి స్పందించారు.

టీడీపీ - జనసేన పొత్తుతో : స్కిల్ స్కాంలో చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబును కలిసిన తరువాత పవన్ అక్కడే జనసేన - టీడీపీ పొత్తు ప్రకటన చేసారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తమతో బీజేపీ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. బీజేపీ నేతలు ఎవరూ ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించలేదు. ఇదే సమయంలో తాను ఢిల్లీకి వెళ్లి పొత్తు నిర్ణయం పైన బీజేపీ నేతలు వివరిస్తానని పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీని ఓడించాలంటే కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పవన్ నేరుగా చంద్రబాబుతో పొత్తు ప్రకటన చేయటంతో బీజేపీ స్పందన ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.

AP BJP Chief Purandeswari made interesting comments over Pawan Kalayn alliacne with TDP

పురందేశ్వరి స్పందన : ఇదే సమయంలో ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. పవన్ వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం లేదన్నారు. బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ చెప్పారని..ఒప్పిస్తామని చెప్పలేదని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తులోనే ఉందని స్పష్టం చేశారు. తమ పార్టీ పెద్దల దృష్టికి రాష్ట్ర పరిస్థితులను పవన్ తీసుకువెళతామన్నారని గుర్తు చేసారు. దీనిపై కేంద్రం పెద్దలు తమతో చర్చలు చేసిన సమయంలో తమ అభిప్రాయాలు చెబుతామని స్పష్టం చేశారు.చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీనే తొలుత తప్పు పట్టిందని, అరెస్టును ఖండిస్తున్నామని ప్రకటన చేశామని పురంధేశ్వరి గుర్తు చేసారు.

బీజేపీ ఏం చేయనుంది : చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారమని అన్నారు. ఎపీ, తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారని పురంధేశ్వరి చెప్పారు. అయితే, ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ పవన్ బీజేపీతో చర్చ చేయకుండానే పొత్తు ప్రకటన చేయటం పైన బీజేపీ అధినాయకత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. బీజేపీ ముఖ్య నాయకత్వం ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించకపోవటంతో టీడీపీతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉందా లేదా అనే సందేహం వ్యక్తం అవుతోంది. పవన్ ప్రతిపాదనకు బీజేపీ అంగీకరించుకుంటే పవన్ ఏం చేస్తారనేది ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+