AP Budget 2026-27 : రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్‌

ఏపీ ప్రభుత్వం భారీ అంచనాలతో 2026-27 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వం లో సాగిన పాలన పైన విమర్శలు చేసారు. రాష్ట్ర విభజన ఒక నష్టం అయితే... ఆ తరువాత అయిదేళ్లు పాలన రాష్ట్రానికి నష్టం చేసిందని ఆరోపించారు. ఈ బడ్జెట్ కేవలం పద్దులే కాదని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించారు. అభివృద్ధి- సంక్షేమంతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలనేదే తమ విధానమని స్పష్టం చేసారు.

రాష్ట్ర బడ్జెట్ 2026-27 ను ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రానున్న ఆర్దిక సంవత్సరానికి రూ 3,32,205 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం తో ఈ బడ్జెట్ ప్రతిపాదించినట్లు వెల్లడించారు. రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేలా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పెట్టుబడి దారులకు అనుకూల వాతావరణం కల్పించామని ఆర్దిక మంత్రి వివరించారు. కీలక రంగాలకు కేటాయింపులు భారీగా పెంచారు.

  • రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు కాగా,
  • మూలధన వ్యయం రూ. 53,915 కోట్లు,
  • రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు..
  • ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లు .

ఇక, శాఖల వారీగా..

  • వ్యవసాయ శాఖ కు రూ 11,745 కోట్లు,
  • పాఠశాల విద్య కు రూ 32, 208,
  • బీసీ సంక్షేమం రూ 23650 కోట్లు,
  • ఇంధన శాఖ- 19,306 కోట్లు,
  • పంచాయితీ రాజ్ కు రూ 22,941 కోట్లు,
  • ఇరిగేషన్ 18,223 కోట్లు,
  • అన్నదాత సుఖీభవ కోసం రూ 6,600 కోట్లు,
  • మత్స్యకార సేవకు 600 కోట్లు,
  • ధరల స్థిరీకరణ కు రూ 560 కోట్లు
  • మనబడి- మన భవిష్యత్ పథకానికి రూ. 1,500 కోట్లు,
  • పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకు రూ. 707 కోట్లు,
  • సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి రూ. 654 కోట్లు,
  • యూత్ అండ్ స్పోర్ట్స్‌కు రూ. 438 కోట్లు,
  • సాగు నీటి ప్రాజెక్టులు: రూ. 9,906 కోట్లు,
  • రాష్ట్రీయ కృషి వికాస్ యోజన: రూ. 1,927 కోట్లు..
  • అన్నదా సుఖీభవ: రూ. 6,600 కోట్లు,
  • మత్య్సకారులకు రూ. 260 కోట్లు..
  • పోలవరం: రూ. 6,105 కోట్లు,
  • ధరల స్థిరీకరణ నిధి: రూ. 500 కోట్లు..
  • పాఠశాల విద్యకు రూ. 32,308 కోట్లు,
  • వైద్య ఆరోగ్య శాఖకు రూ. 19,306 కోట్లు..
  • బీసీ సంఘాల కోసం రూ. 23,650 కోట్లు..
  • జల వనరుల శాఖకు రూ. 18,223 కోట్లు..
  • పంచాయతీ రాజ్ కు రూ. 22,941 కోట్లు,
  • మున్సిపల్ శాఖకు రూ. 14,538 కోట్లు..
ap-budget-2026-27-live-andhra-pradesh-budget-highlights-sector-wise-allocations-key-announcements

Feb 14, 2026, 12:35 pm IST

ఎస్సీ కాంపోనెంట్ కోసం రూ. 20,644 కోట్లు, బీసీ కాంపోనెంట్ కోసం రూ. 51,021 కోట్లు, ఎస్టీ కాంపోనెంట్ కోసం రూ. 9,190 కోట్లు, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం రూ. 6,090 కోట్లు, కార్మిక శాఖకు రూ. 735 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు రూ. 6,357 కోట్లు, ఎనర్జీ శాఖకు రూ. 13,934 కోట్లు, రవాణా, రహదారులు, భవనాల శాఖకు రూ. 9,856 కోట్లు కేటాయింపు..
Feb 14, 2026, 12:19 pm IST

పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రంకు రూ. 714 కోట్లు, పట్టాణాభివృద్ధి శాఖకు రూ. 14,539 కోట్లు.. 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం.. విశాఖ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి 10 జిల్లాలు.. విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ. 28 వేల కోట్లు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కి రూ. 30 వేల కోట్లు.. వీబిజ్ రామ్ జీ పథకానికి రూ. 8,365 కోట్లు, ఎన్టీఆర్ వైద్యసేవకి రూ. 4 వేల కోట్లు.. హౌసింగ్: రూ. 5,451 కోట్లు, జల జీవన్ మిషన్: రూ. 4 వేల కోట్లు.. ఎన్టీఆర్ భరోసా( పెన్షన్స్): రూ. 27,719 కోట్లు.. దీపం పథకానికి రూ. 2,60 కోట్లు.. స్త్రీ శక్తి పథకానికి రూ. 1,420 కోట్లు, రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ. 13,546 కోట్లు, ఎంఎస్‌ఎంఈకి రూ. 3,161 కోట్లు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖకు రూ. 1,283 కోట్లు, పోలీస్ శాఖకు 3 వేల కొత్త వాహనాలు, కొత్త ఏపీ పోలీస్ అకాడమీ ఏర్పాటు కోసం 94 ఎకరాలు.. ఐటీ శాఖకు రూ. 536 కోట్లు, హోం శాఖకు రూ. 9,165 కోట్లు కేటాయింపు..
Feb 14, 2026, 11:52 am IST

మనబడి- మన భవిష్యత్ పథకానికి రూ. 1,500 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకు రూ. 707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి రూ. 654 కోట్లు, యూత్ అండ్ స్పోర్ట్స్‌కు రూ. 438 కోట్లు, సాగు నీటి ప్రాజెక్టులు: రూ. 9,906 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన: రూ. 1,927 కోట్లు.. అన్నదా సుఖీభవ: రూ. 6,600 కోట్లు, మత్య్సకారులకు రూ. 260 కోట్లు.. పోలవరం: రూ. 6,105 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి: రూ. 500 కోట్లు.. పాఠశాల విద్యకు రూ. 32,308 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ. 19,306 కోట్లు.. బీసీ సంఘాల కోసం రూ. 23,650 కోట్లు.. జల వనరుల శాఖకు రూ. 18,223 కోట్లు.. పంచాయతీ రాజ్ కు రూ. 22,941 కోట్లు, మున్సిపల్ శాఖకు రూ. 14,538 కోట్లు..
Feb 14, 2026, 11:45 am IST

తల్లికి వందనం: రూ. 9,668 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం: రూ. 4,581 కోట్లు, స్కాలర్‌షిప్‌: రూ. 3,836 కోట్లు, సమగ్ర శిక్షణ: రూ. 2,946 కోట్లు, అమరావతి కోసం రూ. 6,000 కోట్లు, ఉన్నత విద్య కోసం: రూ. 2,566 కోట్లు, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం: రూ. 2,161 కోట్లు, స్కిల్ డెవలప్‌మెంట్‌: రూ. 1,232 కోట్లు కేటాయింపు..
Feb 14, 2026, 11:39 am IST

కోస్తాలోని మహిళా పారిశ్రామికవేత్తల్లో స్ఫూర్తినింపేది ఈ బడ్జెట్‌ - మంత్రి పయ్యావుల ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఉద్దేశించిందే మా దృష్టిలో బడ్జెట్‌ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు.. అంకెలకు అతీతం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలో పరుగులు పెట్టించాలనే సంకల్పం మాది సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేది అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది
Feb 14, 2026, 11:36 am IST

ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.
Feb 14, 2026, 11:23 am IST

ప్రారంభమైన ఏపీ బడ్జెట్ సమావేశాలు. 2026-27 పద్దును ప్రవేశపెడుతున్న మంత్రి పయ్యావుల. వరుసగా మూడో సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి పయ్యావుల
Feb 14, 2026, 11:01 am IST

2026-27 వార్షిక బడ్జెట్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం బడ్జెట్ ప్రతులను సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కు అందజేసిన పయ్యావుల
Feb 14, 2026, 11:01 am IST

అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మీడియాతో స్పీకర్ మాటామంతి ఇప్పటివరకూ 700 మందికి పైగా విద్యార్థులు అసెంబ్లీని వీక్షించారు. రెండు రోజుల్లోనే 200కుపైగా పాఠశాలల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీలైనంత ఎక్కువమంది విద్యార్థులకు అసెంబ్లీ చూసే అవకాశం కల్పిస్తున్నాం. ఎమ్మెల్యేలు అవుతామనే ఆకాంక్షను కొంతమంది విద్యార్థులు వెళ్లబుచ్చుతున్నారు. నేటితరం విద్యార్థులు రాజకీయాల పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు అసెంబ్లీ చూసే అవకాశం కల్పించిన లక్ష్యం నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉంది: స్పీకర్‌ అయన్న పాత్రుడు
Feb 14, 2026, 10:35 am IST

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం, 2026-27 బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రి వర్గం, రూ.3 లక్షల 45 వేల కోట్ల అంచనాతో ఏపీ బడ్జెట్, మరి కాసేపట్లో సభలో పద్దు ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల
Feb 14, 2026, 10:21 am IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఈ ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శ్రీ పీయూష్ కుమార్ (IAS), ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ (PFS) ​శ్రీ డి. రోనాల్డ్ రోస్ (IAS), కార్యదర్శి, ఆర్థిక శాఖ ​శ్రీ సూరజ్ గనోరే (IAS) ​శ్రీ గౌతమ్ అల్లాడ (IA&AS)
Feb 14, 2026, 9:53 am IST

మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ. 2026-27 ఆర్థిక బడ్జెట్ కి ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్. అమరావతి సచివాలయానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఆర్ధిక మంత్రి పయ్యావుల, ఇతర మంత్రులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+