AP Budget 2024: 2.86 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్-బుగ్గన కీలక ప్రసంగం- హైలెట్స్ ఇవే..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వరుసగా ఐదోసారి రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఏడాది కావడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2.86 లక్షల వ్యయ అంచనాలతో ఈ బడ్జెట్ ను రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,30,110 41 కోట్లు కాగా... మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లుగా ప్రతిపాదించారు.

మరోవైపు బడ్జెట్ లో రెవిన్యూ లోటును రూ.24,758.22 కోట్లుగా చూపారు. ద్రవ్య లోటును రూ. 55,817.50 కోట్లుగా చూపారు.జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.51 శాతంగా తెలిపారు. అలాగే రెవిన్యూ లోటు 1.56 శాతంగా తేలింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో 7 విధానాలు అనుసరించామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఇందులో సుపరిపాలన, సామర్థ్య, మహిళా మహారాణులు, అన్నపూర్ణ, సంక్షేమ, సంపన్న, భూభద్ర ఆంధ్ర విధానాలతో ముందుకు నడిచామన్నారు.

AP Budget placed in legislative assembly with Rs.2.86 lakh Crore outlay- here are highlights

అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 2.05 లక్షల కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో కేంద్ర పన్నుల ద్వారా రూ.49,286 కోట్లు, రాష్ట్ర పన్నుల ద్వారా మరో రూ.1,09,538 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే పన్నేతర ఆదాయం రూ.14400 కోట్లు వస్తాయని, గ్రాంట్ల రూపంలో రూ.32127 కోట్లు వస్తాయని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం లో మొదటి నాలుగు నెలల అవసరాల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదనల్ని ఆర్ధిక మంత్రి సభ ముందుంచారు. వీటిలో వచ్చే ఏప్రిల్, మే,జూన్,జులై నెలల కోసం రూ.88,215 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు చేశారు. ఎన్నికల తర్వాత మరోసారి బడ్జెట్ భేటీ పెట్టి మిగిలిన ప్రతిపాదనల్ని ఆమోదించనున్నారు. ఆలోపు ఓటాన్ అకౌంట్ లో ఆమోదించిన మేరకు ఖర్చు చేసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+