ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పై ఎన్నికల సంఘం అనూహ్య ట్విస్ట్..!!

ఏపీలో ఎన్నికల వేళ హోరా హోరీ రాజకీయం నడుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పాత్ర కీలకం కానుంది. ఈ సమయంలోనే పవన్ కల్యాణ్ - డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ తాజా టీజర్ పై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. దీని పైన పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. అదే విధంగా ప్రధాని మోదీ పాల్గొన్న సభ పైన వచ్చిన ఫిర్యాదుల పైన ఎన్నికల సీఈవో మీనా స్పందించారు.

సీఈఓ స్పందన
పవన్ కల్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ గురించి ఎన్నికల ప్రధానాధికారి మీనా కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేన ఎన్నికల గుర్తు గాజుకు సంబంధించి టీజర్ లో ఉన్న డైలాగ్స్ గురించి స్పందించారు. ఈ టీజర్ టీజర్ రాజకీయ ప్రచారం తరహాలో ఉంటే ఎన్నికల సంఘ అనుమతి అవసరమని తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అందులో డైలాగులు ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు. కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ లో పవన్ కల్యాణ్ డైలాడ్ వైరల్ అవుతోంది. ఈ సినిమా తాజాగా విడుదల చేసిన టీజర్ లో గ్లాస్‌ అంటే సైజు కాదు, సైన్యం - కనిపించని సైన్యం" అంటూ పవన్‌ చెప్పిన వీడియో మొత్తానికి హైలైట్​గా నిలిచింది.

AP CEO MK Meena Reacts over Pawan Kalyan s Movie UStad Bhagat Singh latest Teaser

పవన్ కీలక వ్యాఖ్యలు

ఈ డైలాగ్ గురించి తాజాగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సినిమాలో ఆ గాజు డైలాగ్ చెప్పడం తనకు ఇష్టం లేదని,. కానీ హరీష్ శంకర్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. తాను హరీష్ శంకర్ ని ఆ డైలాగ్ ఎందుకు రాశావని అడిగానని..దీనికి హరీష్ శంకర్ మీరు కొంచెం తగ్గినా చాలా బాధ పడతాము. అలాంటిది మీరు ఓడిపోయారు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. వారందరికీ మా తరుపు నుంచి మీరు సమాధానం చెప్పాలి" అని బలవంతం చేశారని పవన్ వివరించారు. ఎరవైనా ఉద్యోగులు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే వారి పూన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

చర్యల పైన క్లారిటీ
పోలీసు అధికారుల పైన తనకు వచ్చిన ఫిర్యాదును కేంద్ర హోం శాఖకు పంపానని చెప్పారు. దీని పైన ఎన్నికల సంఘానికి సంబంధం ఉండదన్నారు. దీని పైన విచారణ మొదలైందని వెల్లడించారు. ప్రధాని ప్రర్యటన అంతా హోం శాఖ చూస్తుందని వివరించారు. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని తనకు సందేశాలు వస్తున్నాయని..ఈ విషయాన్ని విద్యా శాఖను నివేదించామన్నారు. ఎన్నికల సంఘం అంగీకరిస్తేనే డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని సీఈవో మీనా స్పష్టం చేసారు. వాలంటీర్లకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసామని..ఎవరైనా ఉల్లంఘిస్తే చర్చలు తప్పవని స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+