Chandrababu Dance: ఆదివాసీలతో కలిసి చంద్రబాబు డ్యాన్స్..! వీడియో..
ఎప్పుడూ సభలు, సమీక్షలు అంటూ బిజీగా కనిపించే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ డ్యాన్స్ చేశారు. విజయవాడలో నిర్వహిస్తున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో భాగంగా చంద్రబాబు ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసారు. అరకులోయలో గిరిజనుల సంప్రదాయ నృత్యమైన థింసా డాన్స్ చేస్తూ కాసేపు ఉల్లాసంగా కనిపించారు. ఈ డ్యాన్స్ లో గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా పాల్గొన్నారు.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు పాల్గొన్నారు. అలాగే అరకు నుంచి వచ్చిన ఆదివాసీ మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత బయటికి వచ్చి కాసేపు చంద్రబాబు మహిళలకు కలిసి డ్యాన్స్ చేశారు. అలాగే గిరిజనుల డప్పు కూడా వాయించారు. దీంతో చంద్రబాబు డ్యాన్స్ ను అక్కడున్న వారంతా కాసేపు చూస్తుండిపోయారు.
అంతకు ముందు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. గిరిజన ఉత్పత్తులు ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకునే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యాలు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అరకు కాఫీని ప్రమోట్ చేసిన తరహాలోనే గిరిజన ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తామని చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications