మొదటి 6 నెలల్లో చంద్రబాబు టార్గెట్... అది ఫినిష్?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ , నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, కందుల దుర్గేష్, మండిపల్లి రాంప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంపట్టి సుభాస్ పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి మోడీని.. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పవన్ కల్యాణ్ శాలువా కప్పి జ్ఞాపికను బహుకరించారు.

తెలుగుదేశం పార్టీ కూటమిని చంద్రబాబునాయుడు అత్యంత మెజారిటీతో గెలిపించారు. అందుకు కారణం మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలే అని ఆయన భావిస్తున్నారు. మొదటి ఆరునెలల్లో ఎటువంటి పనులు పెట్టుకోకుండా వీటిని పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కూటమి మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ ను ఆరునెలల్లోపు అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

ap chief minister nara chandrababunaidu first six monthes taget details here

చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ఏమిటనేది ఓసారి పరిశీలిద్దాం.

1. యువతకు ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు (వారికి రూ.3వేల నిరుద్యోగ భృతి)
2. పాఠశాలకు వెళ్లే విద్యార్థినికి ఏటా రూ.15వేలు
3. ప్రతి రైతులకు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి కింద ఏటా రూ.20వేల నగదు
4. ప్రతి ఇంటికి ఏడాదిలో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
5. ప్రతి మహిళకు నెలకు రూ.1500
6. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడినుంచి ఎక్కడికైనా బస్సులో మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఏపీలో కూడా మహిళలు అలాగే ప్రయాణం చేయబోతున్నారు. ఆధార్ కార్డు (ఏపీలోని అడ్రస్ ఉండాలి) చూపించి ఉచిత ప్రయాణం చేయడంద్వారా తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+