దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ఇవన్నీ మీకోసమే !
ఏపీలో దివ్యాంగులపై సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం పలు 7 కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.
అంతే కాకుండా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని తెలిపారు. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు కూడా మళ్లీ ప్రారంభిస్తామన్నారు. బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

అలానే శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నారు. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని స్పష్టం చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగ విద్యార్ధులకు అదే చోట సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు.
మరోవైపు రాష్ట్ర స్థాయిలో అమరావతిలో 'దివ్యాంగ్ భవన్' ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, పెద్దఎత్తున విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు.#AndhraPradesh pic.twitter.com/9Ft9QRctFU
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 3, 2025
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications