లిఫ్ట్‌లో గాయపడ్డ చినరాజప్ప
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సంజీవని ఆసుపత్రిని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప ప్రమాదానికి గురయ్యారు. పెద్దాపురం మండలం కట్టమూరులోని నెక్కంటి సి ఫుడ్స్‌లో గ్యాస్ భాదితులను పరామర్శించేందుకు మంత్రి చినరాజప్ప ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మూడో అంతస్థు నుంచి లిఫ్టులో కిందకు వస్తుండగా లిఫ్టు వైరు ఒక్కసారిగా తెగిపోవడంతో మంత్రి లిఫ్టులో పడిపోయారు. ఈ ఘటనలో మంత్రి చినరాజప్ప నడుము భాగంలో గాయాలయ్యాయి. దీంతో ఆయనను అదే ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications