Pawan kalyan: ఇదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ ప్రజలు తనతో బంధుత్వం కలుపుకోవడం పైన ముఖ్యంగా పిఠాపురం ప్రజలు తాము ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని వాహనాలపై రాసుకు తిరగడం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువతకు స్వీట్ గా చెప్పదలుచుకుంది చెప్పారు.
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ప్రచారంపై పవన్ స్పందన
సార్వత్రిక ఎన్నికల ముందు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ వాహనాల నెంబర్ ప్లేట్ల మీద జరిగిన ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్రెండు పైన తాజాగా పవన్ కళ్యాణ్ సరదాగా వ్యాఖ్యానించారు. పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభలో ప్రసంగించినప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని నెంబర్ ప్లేట్ల పై రాసుకోవడం పైన స్పందించారు.

మీ వల్ల నన్ను కూడా తిడతారు: పవన్ కళ్యాణ్
దయచేసి ఎవరూ నెంబర్ ప్లేట్లపై అలా రాసుకోవద్దని, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి చెడ్డ పేరు తీసుకురావద్దని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. వాహనానికి ఒరిజినల్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎమ్మెల్యే గారి తాలూకా అని చెబితే వారు నన్ను కూడా తిడతారంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.
బైక్ రేస్ లపైన పవన్ వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరూ చట్టాలను పాటించాలని, రూల్స్ ను బ్రేక్ చేయడానికి వీలులేదని హితవు పలికారు. ఇదే సమయంలో యువతను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ యువత రోడ్లపై వేగంగా బైకులు నడపవద్దని రేస్ లు పెట్టకూడదని అన్నారు. ఒకవేళ ఎవరికైనా రేసింగ్ చేయాలనిపిస్తే తనకు ఒక రెండు ఎకరాల స్థలం ఉందని ఆ స్థలాన్ని వినియోగించుకోవచ్చు అన్నారు పవన్ కళ్యాణ్.
వాళ్ళ కోసం ఆ పని చేస్తానన్న పవన్ కళ్యాణ్
తన రెండు ఎకరాల స్థలంలో మడ్ రేస్ పెడతానని పేర్కొన్న పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి రైడ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. బైక్ రేస్ కోసం వచ్చే వాళ్లకు హెల్మెట్లు, సేఫ్ గార్డులు, ఇతర రక్షణ పరికరాలను కూడా అందుబాటులో ఉంచుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బైక్ల పైన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు యువతకు ఆయన తనదైన శైలిలో హితోపదేశం చేశారు. ఫన్నీ కామెంట్స్ చేస్తూనే వారికి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది అర్థమయ్యేలా చెప్పారు..












Click it and Unblock the Notifications