AP elections: పవన్ కళ్యాణ్ జనసేన కోసం.. రంగంలోకి మెగా డాటర్ నిహారిక కొణిదెల!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీలు దూకుడుగా ఎన్నికలలో ప్రజల మద్దతు పొందడం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఈసారి రెండోసారి అధికారం కోసం వైసిపి ఆచితూచి వ్యవహరిస్తుంటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా టిడిపి జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. బీజేపీ జనసేన కూటమిలో బిజెపి చేరుతుందా లేదా అన్నది రేపు తేలనుంది.
ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి బలమైన అభ్యర్థులను బరిలోకి దించి జగన్ ను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఏపీలో ఎన్నికల కోసం జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధంలో పోటా పోటీగా సర్వేలను నిర్వహించి అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. గెలుపు గుర్రాలకు మాత్రమే ఎన్నికలలో అవకాశం ఇస్తామని స్పష్టం చేశాయి అన్ని పార్టీలు.

అంగబలం, అర్ధబలం ఉన్న నాయకులను, ప్రజాక్షేత్రంలో మంచి పేరు ఉన్న నాయకులను తమ అభ్యర్థులుగా ప్రకటించే పనిలో ఉన్నాయి. వైసిపి, టిడిపి మధ్య పోరాటం అటుంచితే, జనసేన మాత్రం ఈసారి చావో రేవో తేల్చుకోవాలని సిద్ధమైంది. జనసేన పార్టీ పెట్టిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగినప్పటికీ, మొదటి ఎన్నికలలో జనసేన పోటీ చేయలేదు. రెండవసారి గత 2019 ఎన్నికలలో పోటీ చేసి ఒకే ఒక స్థానంతో పరిమితమై,ఘోరంగా ఓటమిపాలైంది.
ఇక ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న జనసేన కోసం, పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయాలలో కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ కోసం తాము ఉన్నామని చెబుతున్న కొణిదెల నిహారిక బాబాయ్ కోసం ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తానని స్పష్టం చేసింది.

జనసేన తరపున ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేస్తానని నిహారిక కొణిదెల వెల్లడించారు. గతంలో కూడా బాబాయ్ కోసం తాను ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పిన నిహారిక తన ఓటు సైతం ఏపీ లోనే ఉందని వెల్లడించారు.
మొత్తానికి బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎన్నికల ప్రచారంలో రంగంలోకి దిగుతున్నట్టు చెప్పడం జన సైనికులకు కాస్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈసారి ఎన్నికలలో మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తే బాగుంటుందని పలువురు జనసేన నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications