ఏపీలో పీఆర్సీ పోరు- కలెక్టరేట్లు ముట్టడించిన టీచర్లు, ఉద్యోగులు-భారీగా ఆందోళనలు
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై మండిపడుతున్న ఉద్యోగులు, టీచర్లు ఇవాళ రోడ్డెక్కారు. ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి అన్ని జిల్లాల్లో కలెక్టర్లను ముట్టడించారు. భారీ ఎత్తున తరలివచ్చిన ఉద్యోగులతో కలెక్టరేట్ల వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీలో తమకు న్యాయం చేయాలని వీరు కోరుతున్నారు.

పీఆర్సీ పోరు తీవ్రం
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ పోరు తీవ్రమవుతోంది. పీఆర్సీ ఫిట్ మెంట్ ను 23 శాతానికి పరిమితం చేయడంపై ఇప్పటివరకూ అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు.. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై మరింత మండిపడుతున్నారు. ముఖ్యంగా ఐఆర్ కంటే తక్కువగా పీఆర్సీ ఫిట్ మెంట్ ప్రకటించడం, హెచ్ఆర్ఏలో కోతలు విధించడం, ఇకపై రాష్ట్రస్ధాయిలో పీఆర్సీలు ఉండబోవని ప్రభుత్వం చేసిన ప్రకటనతో వారు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది.

కలెక్టరేట్ల ముట్టడి
ఉపాధ్యాయ సంఘాల ఐకాస ఫ్యాప్టో పిలుపు మేరకు ఇవాళ అన్నిజిల్లాల్లోనూ కలెక్టరేట్లను టీచర్లు ముట్టడిస్తున్నారు. అదే సమయంలో వారికి సంఘీభావంగా మిగతా ఉద్యోగులు కూడా సమ్మెకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ అన్నిజిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. వీరిని కట్టడిచేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఇప్పటికే విధులు బహిష్కరించి నిరసనల్లో పాల్గొంటున్న ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరే వరకూ పోరు ఆపబోమని చెప్తున్నారు.

ఉద్యోగసంఘాలపై ఒత్తిడి
ఇప్పటివరకూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమకు న్యాయం జరిగేలా చూస్తాయని ఆశించిన ఉద్యోగులు.. అలా జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతల్ని కూడా కాదని నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఉద్యోగ సంఘాలు ఇంకా ఉద్యమ కార్యాచరణ పేరుతో కాలయాపన చేస్తుండటంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఆంక్షల్ని కూడా లెక్కచేయకుండా ఇవాళ కలెక్టరేట్ల వద్ద భారీగా ఉద్యోగులు నిరసన తెలిపేందుకు తరలివచ్చారు. దీంతో వీరిలో కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications