జగన్ సర్కార్ కు ఉద్యోగుల తాజా డిమాండ్లివే- ఫిబ్రవరి 26 డెడ్ లైన్ ! ఆరోజే కార్యాచరణ ప్రకటన
ఏపీలో ఉద్యోగులు మరో పోరుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు గడిచిపోయినా తమ సమస్యలు ఎక్కడికక్కడే ఉండటంతో ప్రభుత్వానికి మరోసారి వాటిని గుర్తుచేసారు. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి నేతలు సీఎస్ కు తాజాగా ఓ మెమోరాండం సమర్పించారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా ఇచ్చారు.
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ నేతలు సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డికి 50 పేజీల మెమోరాండం సమర్పించారు. సీఎస్ కు ఇచ్చిన లేఖలో వారు పలు సమస్యల్ని ప్రస్తావించారు. వీటిలో ఉద్యోగులకు రావల్సిన బకాలు అన్ని వెంటనే చెల్లించాలని వారు కోరారు. 11 వ పీఆర్సీని పూర్తిస్దాయిలో అమలు చేసేలా చూడాలన్నారు.
ముఖ్యమంత్రి ఇచ్ఛిన హామీ మేరకు పాతపింఛన్ విదానం పునరుద్దరించాలన్నారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జీపీఎస్ విధానాన్ని ఎట్టి పరిస్దితుల్లోనూ ఒప్పుకోబోమని ఉద్యోగ నేతలు స్పష్టం చేశారు.

అలాగే రాష్టంలో వైఎస్ జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దికరీంచాలని కోరారు, అలాగే ఔట్ సోర్సింగు సిబ్బందికి జీతాలు పెంచాలన్నారు. పబ్లిక్ సెక్టారు/గురుకులాలు/యూనివర్సిటీ నాన్ టీచింగు ఉద్యోగుల వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల్లో పెండింగు పెట్టిన 2096 ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగ నేతలు కోరుతున్నారు. పెండింగు పెట్టిన ఓటి అలవెన్సులు మంజూరు చేయాలన్నారు.
EHS ద్వారా ఉద్యోగులకు మెరుగైన వైద్యసౌకర్యాలు అందడంలేదని, పెండింగు మెడికల్ బిల్లులు చెల్లించడం లేదని ఉద్యోగులు సీఎస్ దృష్టికి తెచ్చారు. మహిళాఉద్యోగులకు చైల్డ్ కేర్ &మెటర్నరటీ లీవు మంజూరు చేయాలని కోరారు. చనిపోయిన ఉద్యోగులు కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
వైద్యరంగంలో పనిచేస్తున్ణ డాక్టర్స్, వైద్యసిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, ఖాళీలను బర్తిచేయాలని కోరారు.
ప్రభుత్వడ్రైవర్లకు సంబందించి అద్దె వాహనాలు తొలగించి ప్రభుత్వవాహానాలు కొనుగోలు చేయాలన్నారు. భుత్వశాఖలలో ఉన్న విభాగాలలో ఉన్నాఖాళీలను భర్తీ చేసి పదోన్నతలు కల్పించాలని వారు కోరారు. ఈ నెల 26 లోగా సియస్ గారికి ఇచ్చిన లేఖపై స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 26నే ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర్ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications