దీపావళికి వైఎస్ జగన్ ఆసక్తికర సందేశం!
దీపావళి పండుగ.. హిందువులకు చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ ప్రతీ ఒక్కరికి సంతోషాలను, వెలుగులను అందించే పండుగ. అటువంటి దీపావళి పండుగను చేసుకునే ప్రజలకు రాజకీయ రంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
జగన్ దీపావళి శుభాకాంక్షలు
ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిగారి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక
దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. అటువంటి దీపావళిఅందరికీ మంచి చెయ్యాలని ఆకాక్షించారు.
ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలన్న జగన్
దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని వైఎస్ జగన్ కోరుకున్నారు. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిగారు ఆకాంక్షించారు.
దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుచేసిన చంద్రబాబు
ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమలులోకి తీసుకువచ్చింది. దీపం-2 పథకానికి రాష్ట్రం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 హామీల్లో భాగంగా ఇచ్చిన యేడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆయిల్ సంస్థలకు సబ్సిడీ మొత్తం ఇచ్చిన చంద్రబాబు
దీనికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేశారు. బుధవారం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించారు.












Click it and Unblock the Notifications