Sajjala : ఎమ్మెల్సీ ఫలితాలపై సజ్జల రియాక్షన్- హెచ్చరిక కాదు-వ్యతిరేకత లేదు..

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా సాధిస్తున్నవిజయాలపై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో వాటిని విశ్లేషించారు.

అమరావతి : ఏపీలో తాజాగా జరిగిన పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ వరుస విజయాలు నమోదు చేసుకున్న వైసీపీకి.. పట్టభద్రుల పోరులో మాత్రం ఓటమి తప్పలేదు. 9 ఉమ్మడి జిల్లాల్లోని వందకు పైగా నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయంగా చెబుతున్న ఈ ఎన్నికల ఫలితాలపై వైసీపీలోనే అంతర్మథనం మొదలైందని భావిస్తున్న నేపథ్యంలో పార్టీ కీలక నేత సజ్జల మాత్రం భిన్నంగా స్పందించారు.

ఎమ్మెల్సీ ఫలితాలపై సజ్జల

ఎమ్మెల్సీ ఫలితాలపై సజ్జల

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అనూహ్యంగా వెనుకబడిన నేపథ్యంలో ఈ ఫలితాలపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) స్పందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని ఆయన తెలిపారు. పీడీఎఫ్ ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్ళాయని ఆయన అంగీకరించారు. అంతేకాదు ఈ ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలు కలిపి చూడాలని కోరారు.

హెచ్చరిక కాదన్న సజ్జల

హెచ్చరిక కాదన్న సజ్జల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏ రకంగాను ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రతిఫలించవని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదన్నారు. ఈ ఫలితాలను తాము హెచ్చరిక గా భావించడం లేదన్నారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని సజ్జల తెలిపారు. ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారని ఎదురు ప్రశ్నించారు. తాము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు లేరంటూ మరో కొత్త వాదన కూడా సజ్జల తెరపైకి తెచ్చారు.

ఎమ్మెల్యే పోరు గెలిచేందుకు టీడీపీ ?

ఎమ్మెల్యే పోరు గెలిచేందుకు టీడీపీ ?

రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు సజ్జల తెలిపారు. యువతకు కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లు జారీచేశామని వెల్లడించారు. నిరుద్యోగుల వ్యతిరేకత వల్లే వైసీపీ ఓడిపోయిందన్న వాదన నేపథ్యంలో సజ్జల ఈ కామెంట్స్ చేశారు. మరోైవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ బరిలోకి దిగడాన్ని సజ్జల ఆక్షేపించారు. తెలంగాణ తరహాలోనే బలం లేకపోయినా ఎన్నికలు గెలిచేందుకు టీడీపీ ప్రయత్నించే అవకాశం ఉందని సజ్జల వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+