శాంతి వివాదంలో మరో టర్న్! భర్తెవరో చెప్పాలని మెమో-సాయిరెడ్డి ట్వీట్ పైనా..!

ఏపీ దేవాదాయశాఖలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండైన కాళంగిరి శాంతి భర్త వివాదంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. తన భార్యకు కలిగిన సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ గతంలో దేవాదాయశాఖకు ఆమె భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు నీ భర్తెవరో చెప్పాలంటూ ఆమెకు అధికారులు మెమో జారీ చేశారు. అసలు ఆమె భర్త వివాదం, దాని వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు కలుగుతున్న భంగం, ఆమె వ్యవహారశైలిపై పూర్తి వివరణకు ఆదేశించారు.

దేవాదాయశాఖలో ఉద్యోగంలో చేరిన 2020లో తన భర్త పేరు కె మదన్ మోహన్ గా సర్వీస్ రిజిస్టర్ లో పేర్కొన్న శాంతి.. గతేడాది ప్రసూతి సెలవుకు దరఖాస్తు చేసుకున్న సమయంలోనూ ఇదే చెప్పారు. అయితే తాజాగా ప్రెస్ మీట్ పెట్టి పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పడం, అంతకు ముందే ఆమె సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు ఆమెకు మెమో జారీ చేశారు. ఇందులో నీ భర్తెవరో చెప్పాలంటూ ఆదేశించారు.

ap government ask endowments dc santhi explanation on husband row also on vijayasai reddy tweet

విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమంటూ, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆమెకు మెమో పంపారు. దీంతో పాటు మరో 6 అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటికే సస్పెండ్ చేస్తూ 9 అభియోగాలు మోపిన అధికారులు.. ఇప్పుడు తాజాగా మరో 6 అభియోగాలు మోపారు. ఇందులో భర్త పేర్లు మార్చడం, దేవాదాయశాఖ ప్రతిష్టకు భంగం కలిగించడం, కమిషనర్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం, సాయిరెడ్డిపై గతేడాది పెట్టిన ట్వీట్, విశాఖలో అపార్ట్ మెంట్ ఫ్లాట్ ఓనర్లతో గొడవ, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఆలయ దుకాణాలు, భూముల లీజుల పొడిగింపు వంటివి ఉన్నాయి.

విజయసాయిరెడ్డితో శాంతి అనుబంధంపై ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేస్తున్న వేళ గతేడాది మే 28న ఆమె పెట్టిన ట్వీట్ పై అభియోగం నమోదైంది. ఇందులో ఆమె.. "ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సర్. మీరు పార్టీకి వెన్నెముక" అంటూ పెట్టిన ట్వీట్ పై అభియోగం మోపారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ఈ ట్వీట్ పెట్టారని అందులో పేర్కొన్నారు. మరోవైపు శాంతి డిప్యూటీ కమిషనర్ గా విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో పనిచేసినప్పుడు చేసిన అక్రమాలపై విచారణకు అధికారులతో మరో కమిటీ వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+