Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కనిగిరి ఘటన: కలెక్టర్‌ను నివేదిక కోరిన ప్రభుత్వం

ప్రకాశం జిల్లా కనిగిరిలో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరిలో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. డిగ్రీ విద్యార్థినిపై సహచర విద్యార్థులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. అంతేకాదు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన చోటుచేసుకొన్న ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

Ap government asks report on Kanigiri rape attempt

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా, అత్యాచారయత్నానికి గురైన బాధితురాలిని, ఆమె కుటుంబసభ్యులను మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు.బాధితరాలికి అండగా ఉంటామని హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్‌ చేశారు.

కనిగిరిలో స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై యువకులు అత్యాచార యత్నం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. యువతి ప్రతిఘటిస్తున్నా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+