ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకు దరఖాస్తు చేసుకున్నారా ? తాజా డెడ్ లైన్ ఇదే..!

ఏపీలో ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రోత్సహించేందుకు సిద్దమవుతోంది. దీని కోసం రాష్ట్రంలో అసలు వర్క్ ఫ్రమ్ హోం ద్వారా ఉద్యోగం కల్పిస్తే చేసేందుకు ఎంత మంది సిద్దంగా ఉన్నారో తెలుసుకునేందుకు వీలుగా కౌశలం పేరుతో సర్వే నిర్వహిస్తోంది. రెండు నెలల క్రితమే మొదలైన ఈ సర్వేను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో నిర్వహిస్తున్నారు. దీనికి గడువు ముగిసినా మరోసారి పొడిగింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు కోరుకుంటున్న వారిని కనీసం 10వ తరగతి అర్హతతో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. కౌశలం పేరుతో చేపట్టిన ఈ సర్వేను ఓవైపు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తుండగా.. మరోవైపు ఆన్ లైన్ లోనూ నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సర్వే గడువు ఈ నెల 15తోనే ముగిసింది. అయితే ప్రస్తుతం ఈ నెల 20వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించేలా మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ap government extends deadline for applications of work from home survey

రాష్ట్రంలో కనీసం 10 వ తరగతి , ఆ పైన విద్యార్హతలు కలిగిన వారు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి కౌశలం సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డుతో పాటు ఇతర వివరాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆన్ లైన్ లో https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam వెబ్ సైట్లోకి వెళ్లి ఆధార్, ఇతర వివరాలు ఎంటర్ చేస్తే ఓటీపీలు వస్తాయి. మొబైల్ నంబర్ తో పాటు ఈమెయిల్ ను కూడా ఓటీపీలతో ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్హతలు ఎంటర్ చేస్తే వివరాలను ధృవీకరిస్తారు. కాబట్టి ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే ఆన్ లైన్ లేదా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ap government extends deadline for applications of work from home survey

ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత దరఖాస్తు దారులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉపాధి కల్పించే వారితో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని వీరికి ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాగే వీరు వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు ప్రత్యేకంగా హబ్ లు ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. వీటిలో ఇంటర్నెట్ తో పాటు నిరంతర విద్యుత్, ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ఇతర వివరాలకు గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+