మరోసారి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ఏపీ సర్కారు.. ఎవరికి ఏ పదవి అంటే ?

ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు ప్రభుత్వం వేగం పందించింది. ఇందులో భాగంగా పలు ముఖ్యమైన కార్పొరేషన్లు, కమిషన్లకు కొత్త ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సామాజిక వర్గాలు, కూటమి పార్టీలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఈ నియామకాలు జరగడం గమనార్హం.

ప్రెస్ అకాడమీ, మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్‌కి కొత్త నాయకత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా ఆమరావతి జేఏసీకి చెందిన ఆలపాటి సురేష్ నియమితులయ్యారు. అలానే అదే జేఏసీకి చెందిన రాయపాటి శైలజను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ నియామకం అయ్యారు.

ap-government-has-once-again-filled-nominated-posts

ఆప్కాబ్‌, డీసీసీబీలకు ఛైర్మన్ల నియామకం..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB)తో పాటు పలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCBs)కి ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్: పీతల సుజాత (భీమవరం, టీడీపీ)

APNRT సొసైటీ: రవి వేమూరు (తెనాలి, టీడీపీ)

APSSDC: బురుగుపల్లి శేషారావు (నిడదవోలు, టీడీపీ)

ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు: డా. జెడ్‌. శివప్రసాద్‌ (నెల్లూరు సిటీ, టీడీపీ)

APEWIDC: ఎస్‌. రాజశేఖర్‌ (కుప్పం, టీడీపీ)

టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య: ఆకాసపు స్వామి (తాడేపల్లిగూడెం, టీడీపీ)

గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్: సుగుణమ్మ (తిరుపతి, టీడీపీ)

కార్మిక సంక్షేమ బోర్డు: వెంకట శివుడు యాదవ్ (గుంతకల్‌, టీడీపీ)

భవన నిర్మాణ కార్మికుల బోర్డు: వలవల బాబ్జీ (తాడేపల్లిగూడెం, టీడీపీ)

తుడా: దివాకర్ రెడ్డి (తిరుపతి, టీడీపీ)

ఈయుడీఏ: వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన (ఏలూరు, టీడీపీ)

మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య: పెదిరాజు కొల్లు (నరసాపురం, టీడీపీ)

కుమ్మరి శాలివాహన సంక్షేమ కార్పొరేషన్: పేరేపి ఈశ్వర్ (విజయవాడ తూర్పు, టీడీపీ)

వడ్డెర సంక్షేమ కార్పొరేషన్: మల్లెల ఈశ్వరరావు (గుంటూరు పశ్చిమ, టీడీపీ)

అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: మాలేపాటి సుబ్బానాయుడు (కావలి, టీడీపీ)

మిత్రపక్షాలకు ...

ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన జనసేన మరియు భాజపా పార్టీలకు కూడా పలు పదవులు కేటాయించారు.

హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్: పసుపులేటి హరిప్రసాద్ (తిరుపతి, జనసేన)

APSIDC: లీలాకృష్ణ (మండపేట, జనసేన)

లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ: రియాజ్ (ఒంగోలు, జనసేన)

షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్: సోల్ల బోజ్జి రెడ్డి (రంపచోడవరం, భాజపా)

ఈ నియామకాలతో సీనియర్ లకు చంద్రబాబు న్యాయం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీ కూడా జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాయకులకు వారి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+