ఏపీలో నిరుద్యోగులకు సర్కార్ అదిరిపోయే న్యూస్..!

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ అదిరిపోయే వార్త చెప్పింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, వయస్సు మీరిపోతున్న వారికి ఊరట కల్పిస్తూ కూటమి సర్కార్ ఇవాళ కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రెండు కేటగిరీల్లో ఇలా వయో పరిమితిని పెంచారు.

ap government increases age limit for applying jobs- here are details

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న యూనిఫామ్, నాన్-యూనిఫామ్ కేటగిరీ ఉద్యోగాలకు వయో పరిమితుల్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం యూనిఫామ్ ఉద్యోగాలకు ప్రస్తుతం ఉన్న 34 ఏళ్ల వయో పరిమితిని 42 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు ప్రస్తుతం ఉన్న వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచారు. తద్వారా రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు ప్రయోజనం లభించనుంది.

అయితే ప్రభుత్వం ఇక్కడ ఓ మెలిక పెట్టింది. ఇప్పటికిప్పుడు భర్తీ చేసే ఉద్యోగాలకు ఈ వయో పరిమితి వర్తించకుండా వాయిదా వేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్లకు ఈ వయో పరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో సెప్టెంబర్ నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ పెంపు వర్తించబోతోంది. మిగతా వారికి మాత్రం ప్రస్తుతం ఉన్న వయో పరిమితి యథాతథంగా ఉండబోతోంది.

రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి విస్మరించింది. అయితే సచివాలయ, వాలంటీర్ ఉద్యోగాలను భారీ ఎత్తున భర్తీ చేసింది. మిగతా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో కూటమి పార్టీలు ఎన్నికల్లో తమకు అధికారమిస్తే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఇచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు ప్రకటన వచ్చిందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+