ఏపీలో ఐదు రోజుల వర్షాలు-మూడు నదుల్లో.! ఈ జిల్లాల్లో అలర్ట్ లు..!

ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశముంది. దీని ప్రభావంతో రేపు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని హెచ్చరించింది. అలాగే వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పార్వతీపురం మన్యం, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి మన్యం జిల్లా సీతంపేటలో 77మిమీ, కోనసీమ జిల్లా మలికిపురంలో 74.5మిమీ, భీమవరంలో 67.5మిమీ, విజయవాడ పశ్చిమలో 62.5మిమీ, విజయవాడ సెంట్రల్ లో 62మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైంది.

AP Government Issues Live Alerts Across Three Rivers and Districts Following IMD Warnings

ఎగువ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వివిధ ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పొంగిపొర్లే నదులు, కాలువలు,వాగులు దాటే ప్రయత్నం, స్నానాలు చేయడం లాంటివి చేయరాదన్నారు. వినాయక నిమజ్జనాల్లో నదులు/కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను పాటిస్తూ అధికారులకు సహకరించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.

AP Government Issues Live Alerts Across Three Rivers and Districts Following IMD Warnings

మరోవైపు రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు వద్ద అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. వర్షాల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిన సందర్భాల్లో తక్షణమే స్పందించి ప్రమాదాలను నివారించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+