ప్రభుత్వంలో భారీ ప్రక్షాళన - 39 మంది ఐపీఎస్‌లు బదిలీ..!!
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అటు పార్టీ..ఇటు ప్రభుత్వంలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ వారికి దిశా నిర్దేశం చేసారు. ఒకేసారి 56 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..ఇప్పుడు 39 మంది ఐపీఎస్ ల బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన ఐఏఎస్ బదిలీల్లో నూ కొన్ని మార్పులు జరిగాయి. ఇక, పూర్తిగా ఎన్నికల టీంతో పాలనా పరంగా వేగంగా అడుగులు వేసేందుకు సీఎం జగన్ నిర్ణయించారు.
ఎలూరు రేంజ్ డీఐజీగా జీవీజీ అశోక్ కుమార్ నియమితులయ్యారు. గుంటూరు రేంజ్ ఐజీగా పాల రాజ్ ను నియమించారు. విశాఖ పట్నం పోలీస్ కమిషనర్ గా త్రివిక్రమ్ వర్మ , విజయవాడ రైల్వే ఎస్పీ గా రాహుల్ దేవ్ సింగ్ , నెల్లూరు ఎస్పీ గా తిరుమలేశ్వర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్.ఎన్. అమ్మి రెడ్డి - డీఐజీ,అనంతపురం రేంజ్, ఎం. రవి ప్రకాష్ - డీఐజీ,సెబ్.. బి.రాజ కుమారి-ఏపీఎస్బీ డీఐజీ , సర్వశ్రేష్ఠ త్రిపాఠి - అడ్మిన్ డీఐజీ,డీజీపీ ఆఫీస్...కోయ ప్రవీణ్ - డీఐజీ, గ్రే హౌండ్స్...శంక బ్రత బాగ్చి - అడిషనల్ డీజీ,లా అండ్ ఆర్డర్,, రవి శంకర్ అయ్యనార్ - విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ డీజీ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా అతుల్ సింగ్ ఏపీఎస్పీ అడిషనల్ డీజీ గాను అదనపు బాధ్యతలు అప్పగించారు. మనీష్ కుమార్ సిన్హా - జీఎడి కి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సీహెచ్.శ్రీకాంత్ - సీఐడీ ,ఐజీ..పి.వెంకట్రామి రెడ్డి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ...విక్రాంత్ పాటిల్ - పార్వతీపురం మన్యం ఎస్పీ..వాసన్ విద్యా సాగర్ నాయుడు - లా అండ్ ఆర్డర్ డీసీపీ,విశాఖ సిటీ..గరుడ్ సుమిత్ సునీల్ - ఎస్పీ,ఎస్ఐబీ...తుహిన్ సిన్హా - ఎస్పీ,అల్లూరి జిల్లా.., ఎస్.సతీష్ కుమార్ - కాకినాడ జిల్లా ఎస్పీ గా నియమితులయ్యారు. ఎం. రవీంద్రనాధ్ బాబు -జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
కేవీ మురళి కృష్ణ - అనకాపల్లి జిల్లా ఎస్పీ, గౌతమి శాలి - ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్, సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి - తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, .పి.శ్రీధర్ - కోనసీమ జిల్లా ఎస్పీ, డి.మేరీ ప్రశాంతి - ఏలూరు జిల్లా ఎస్పీ, రాహుల్ దేవ్ శర్మ - ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్, సీహెచ్ విజయరావు -ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్, ఆర్.గంగాధర్ రావు - అన్నమయ్య జిల్లా ఎస్పీ, వి.హర్షవర్ధన్ రాజు - సీఐడీ ఎస్పీ, కె.శ్రీనివాసరావు - అనంతపురం ఎస్పీ, ఫకీరప్ప - సీఐడీ ఎస్పీ, ఎస్వీ మాధవ్ రెడ్డి - సత్య సాయి జిల్లా ఎస్పీ, జి.కృష్ణ కాంత్ - కర్నూలు ఎస్పీ, సిద్దార్ద్ కౌశల్ - ఆక్టోపస్ ఎస్పీ , అజిత వేజెండ్ల - విజయవాడ డీసీపీ(జగ్గయ్యపేట), పి.జగదీష్ - ఏపీఎస్పీ 14వ బెటాలియన్ కమాండెంట్, బిందు మాధవ్ గరికపాటి - గ్రే హౌండ్స్ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications