ఏపీలో స్కూల్ అసిస్టెంట్లు, హెడ్మాస్టర్ల ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల..
ఏపీలో టీచర్లు, హెడ్మాస్టర్ల బదిలీలకు గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, అనంతరం ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లలో పనిచేస్తున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రమోషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వనించింది. వీటి ఆధారంగా ఇప్పుడు ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టేందుకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మొత్తం ప్రక్రియ ఈ నెల 30న ప్రారంభమై వచ్చే నెల 5తో ముగియనుంది.
ఏపీలో హెడ్మాస్టర్ల ప్రమోషన్ కోసం పాఠశాల విద్యాశాఖ ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం గ్రేడ్ 2 హెడ్మాస్టర్ల పోస్టు కోసం ప్రమోషన్లు కల్పించే ప్రక్రియ మొదలుకానుంది. ఇందులో భాగంగా గ్రేడ్ 2 హెచ్ఎం పోస్టు కోసం తాత్కాలిక సీనియార్టీ లిస్టును ఈ నెల 30న విడుదల చేస్తారు. అనంతర వచ్చే నెల 1, 2 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జూలై 3న తుది సీనియార్టీ జాబితాను ప్రకటిస్తారు. జూలై 4వ తేదీన గ్రేడ్ 2 హెచ్ఎం పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికై వారు జూలై 5 కొత్త స్ధానాల్లో వెళ్లి చేరాల్సి ఉంటుంది.

అలాగే ఎస్టీజీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రమోషన్ కల్పించేందుకు మరో మెమో ద్వారా షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం భాషాపరమైన పోస్టులు కాకుండా ఎస్టీజీ లేదా దానికి సమానమైన పోస్టుల వారితో తయారు చేసిన తాత్కాలిక సీనియార్టీ లిస్ట్ ను ఈ నెల 30న ప్రకటిస్తారు. వచ్చే నెల 1 , 3 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జూలై 4న తుది సీనియార్టీ జాబితాను వెల్లడిస్తారు. తర్వాత జూలై 5న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన వారు జూలై 6న కొత్త స్ధానాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications