2025 లో ప్రభుత్వ సెలవులు ఇవే - కేలండర్ ఇలా..!!

ఏపీ ప్రభుత్వం 2025 లో సెలవుల జాబితా ప్రకటించింది. వచ్చే ఏడాది(2025)కి 23 సాధారణ, 21 ఐచ్ఛిక సెలవుల్ని ప్రకటిస్తూ శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు సాధారణ పండుగ సెలవులు 23 రోజులుగా పేర్కొన్నారు. అదే విధంగా ఆప్షన్ సెలవుల జాబితాను వెల్లడించింది. పలు ప్రధాన సెలవులు ఈ ఏడాది ఆదివారం వచ్చాయి.
సెలవుల జాబితాను పండుగలు, ప్రత్యేక దినాలను ప్రస్తావిస్తూ ఖరారు చేసారు.

సెలవుల జాబితా
2025 సంవత్సరంలో ప్రభుత్వం సెలవుల జాబితా విడుదల చేసింది. జనరల్‌ హాలిడేస్‌ (ఫెస్టివల్స్‌) 23 రోజులుగా పేర్కొన్నారు. రిపబ్లిక్‌ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహరం పండగలు ఆదివారం వచ్చినట్లు తెలిపారు. ఆప్షనల్‌ హాలిడేస్‌ను 21 రోజులు సెలవు దినాలుగా ప్రకటించగా, మహాలయ అమావాస్య, ఈద్‌ ఇ గడీర్‌ సెలవులు జీవో లో పేర్కొన్నారు. సాధారణ సెలవుల్లో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం తేదీల్లో వచ్చాయి. ఇక ఐచ్ఛిక సెలవుల్లో ఈద్‌-ఎ-గదిర్, మహాలయ అమావాస్య కూడా ఆదివారం రోజే ఉన్నాయి.

AP government releases the list of General and Optional holidays in 2025 as latest GO

సెలవుల లిస్టు
ప్రభుత్వ విడుదల చేసిన 2025 సెలవుల జాబితాలో: భోగి : 13-01-2025(సోమవారం), సంక్రాంతి : 14-01-2025(మంగళవారం), కనుమ - 15-01- 2025(బుధవారం), రిపబ్లిక్
డే : 26-01-2025(ఆదివారం), మహా శివరాత్రి : 26-02-2025(బుధవారం), హోలీ : 14-03-2025(శుక్రవారం), ఉగాది : 30-03-2025(ఆదివారం), ఈద్ ఉల్ ఫిత్ర్ (రంజాన్) : 31-03-2025(సోమవారం), బాబు జగ్జీవన్ రామ్ జయంతి : 05-04-202(శనివారం),
శ్రీరామ నవమి : 06-04-2025(ఆదివారం), బి.ఆర్. అంబేద్కర్ జయంతి 14-04-2025 సోమవారం), గుడ్ ఫ్రైడే : 18-04-2025(శుక్రవారం) ఉన్నాయి.

సాధారణ సెలవులు
అదే విధంగా.. ఈదుల్ అజా (బక్రీద్) : 07-06-2025(శనివారం), మొహరం : 06-07-2025 ఆదివారం), వరలక్ష్మీవ్రతం - 08- 08- 2025(శుక్రవారం), స్వాతంత్ర్య దినోత్సవం : 15-08-2025(శుక్రవారం), శ్రీ కృష్ణాష్టమి : 16-08-2025(శనివారం), వినాయక చవితి : 27-08-2025(బుధవారం), ఈద్ మిలాదున్ నబీ : 05-09-2025(శుక్రవారం). దుర్గాష్టమి - సెప్టెంబర్ 30, 2025(మంగళవారం), మహాత్మా గాంధీ జయంతి/విజయ దశమి : 02-10- 025 గురువారం), దీపావళి : 20-10-2025(సోమవారం), క్రిస్మస్ : 25-12-2025 (గురువారం) సాధారణ సెలవులుగా ప్రకటించారు.

ఆప్షన్ సెలవులు
అదే విధంగా ఆప్షన్ సెలవుల జాబితాలో న్యూ ఇయర్ - జనవరి 1, 2025(బుధవారం),
హజ్రత్ అలీ పుట్టినరోజు : 13-01-2025(సోమవారం), షబ్ ఏ మెరాజ్ - 27.01.2025,
షబే ఎ బరాత్ - 14- 02- 2024(శుక్రవారం), షాహదత్ ఏ హజరత్ అలీ : 22-03-2025 గురువారం), జుమాతుల్ వాడ / షాబ్-ఇ-ఖాదర్ : 28-03-2025(శుక్రవారం), మహావీర్ జయంతి : 10.04.2025(గురువారం), బసవ జయంతి : 30-04-2025(బుధవారం),
బుద్ధ పూర్ణిమ : 12-05-2025(సోమవారం), ఈద్-ఎ-గదీర్ : 15-06-2025 (ఆదివారం)
రథ యాత్ర : 27-06-2025(శుక్రవారం), 9వ మొహర్రం : 05-07-2025(శనివారం),
శ్రావణ పూర్ణిమ : 15-08-2025(శుక్రవారం), మహాలయ అమవాస్య - సెప్టెంబర్ 21, 2025(ఆదివారం), యాజ్ దహుమ్ షరీఫ్ : 09-10-2025(గురువారం), నరక చతుర్ధి : 19-10-2025(ఆదివారం), కార్తీక పూర్ణమ - 11 నవంబర్ 2025, గురు నానక్ జయంతి - 11 నవంబర్ 2025, కిస్మస్ ఈవ్ -24 డిసెంబర్ 2025(బుధవారం), బాక్సింగ్ డే - 26 డిసెంబర్
ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+