AP Pensions: ఆ పెన్షన్లర్లకు చంద్రబాబు షాక్-ఏకంగా 70 శాతం అవుట్.. !

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిన అతి పెద్ద హామీ పెన్షన్ల పెంపు. రాష్ట్రంలో అప్పటికే ఉన్న దాదాపు 65 లక్షల ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచిన సీఎం చంద్రబాబు.. అదే సమయంలో అనర్హులను తేల్చాలని ఆదేశాలు ఇచ్చారు.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు కొంతకాలంగా క్షేత్రస్ధాయిలో పరిశీలలన చేస్తూ ఏరివేతలు చేపడుతున్నారు. ఇందులో ఓ కేటగిరిలో మాత్రం ఏకంగా 70 శాతం మంది లబ్దిదారుల్ని తొలగిస్తున్నారు.

ap government survey found 70 percent of long-term diseased pensioners fake removal soon

రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లతో పాటు దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచం మీదే ఉండిపోతున్న వారికి కూడా వివిధ కేటగిరీల్లో వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన 24 వేల మందికి నెలకు రూ.15 వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇప్పటివరకూ ఇలా నెలకు రూ.15 వేల చొప్పన పెన్షన్లు ఇచ్చారు. అయితే తాజాగా ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు క్షేత్రస్దాయిలో వైద్యుల సాయంతో వీటిని చెక్ చేశారు.

ఇందులో కేవలం 20-30 శాతం మంది మాత్రమే అర్హులైన లబ్దిదారులుగా తేల్చారు. మరో 40-50 శాతం మంది వైకల్యంతో బాధపడుతున్నా ఇలా రూ.15 వేల పెన్షన్ కు మాత్రం అర్హులు కాదని తేలింది. అలాగే మరో 25-30 శాతం మంది అసలు ఏమాత్రం ఈ పథకానికి అర్హులు కాదని తేల్చారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన 24 వేల మందికి పెన్షన్ల చెల్లింపుకు ప్రభుత్వానికి నెలకు రూ.36 కోట్లు ఖర్చవుతోంది. ఏడాదికి రూ.433.63 కోట్లు ఖర్చవుతోంది.

ప్రస్తుతం ఈ కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో సగం మంది కేవలం దివ్యాంగుల కోటా కింద రూ.6 వేలు మాత్రమే తీసుకోవాల్సి ఉండగా.. రూ.15 వేలు తీసుకుంటున్నారు. వీరిని తొలగిస్తే నెలకు రూ.10.84 కోట్లు, ఏడాదికి రూ.130 కోట్లు ఆదా అవుతాయని అంచనా. అలాగే అసలు అర్హులు కాని 25 శాతం మందిని తొలగిస్తే నెలకు మరో 9 కోట్ల చొప్పున ఏడాదికి రూ.108 కోట్లు ఆదా అవుతాయి. ఈ లెక్కన వీరందరినీ తొలగిస్తే మొత్తంగా ఏడాదికి రూ.238 కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+