అన్నదాత సుఖీభవకు అర్హత సాధించలేదా ? సర్కార్ మరో ఛాన్స్..!
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా భారీ ఎత్తున రైతులకు మేలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇలాంటి తరుణంలో పలు కీలక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం కింద తమ వాటాగా 7 వేల రూపాయల్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం అంతకు ముందే అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఇప్పటికే ఈ పథకం కింద డబ్బులు ఇచ్చేందుకు అనర్హులుగా మారిన వారికి ఈ ఆదేశాలు ఊరటనిచ్చేలా ఉన్నాయి.
రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2న సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభిస్తారు. అనంతరం లబ్దిదారులకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే లబ్దిదారుల జాబితాల్ని సిద్దం చేశారు. ఆధార్ సీడింగ్ తో ఈ-కేవైసీ పూర్తి చేసి, ఎన్సీపీఐ మ్యాపింగ్ చేయించుకున్న ఖాతాల్లో ఈ పథకం డబ్బుల్ని ఆగస్టు 2న జమ చేస్తారు. అయితే ఈ రెండింటిలో ఒకటి లేదా రెండూ పూర్తి కాని వారు, భూమి మ్యుటేషన్ ప్రక్రియ జరగకపోవడం, చనిపోయిన వారి ఖాతాలు ఇలా పలు కారణాలతో అనర్హుల జాబితా కూడా పెద్దే ఉంది.

ఈ నేపథ్యంలో ఇ-కెవైసీ,ఎన్సీపీఐ మ్యాపింగ్ కాని రైతులు వాటిని వెంటనే పూర్తి చేయించుకోవాలని ఆర్టీజిఎస్ ద్వారా ఆయా రైతులందరికీ మెసేజ్ పంపుతున్నారు. అదే సమయంలో రైతుల్ని కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్లి తమ పేర్లు జాబితా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆయా జాబితాలో పేర్లు లేకపోతే వారు ఈ-కేవైసీ, ఎన్సీపీఐ మ్యాపింగ్ పూర్తి కాకపోవడం లేదా మరే ఇతర కారణమో తెలుసుకుని పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు.
అదే సమయంలో అధికారులకు కూడా ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. అన్నదాత సుఖీభవ-పియం కిసాన్ పథకం కింద అనర్హులుగా గుర్తించి తిరస్కరించబడిన వారికి కారణాల్ని కూడా స్పష్టంగా చెప్పాలని ఆదేశాలు పంపింది. అలాగే అనర్హులుగా మారిన వారి వివరాలను రేపటి లోగా మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైనా అర్హత గల వారిని గుర్తిస్తే వెంటనే అర్హుల జాబితాలో చేర్చాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications