Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cognizant: వైజాగ్ లో అప్పుడే కాగ్నిజెంట్ ట్విస్ట్..! సర్కార్ నిర్ణయం ఇదే..!

ఏపీలో ఐటీ సంస్థల్ని, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఆయా సంస్దలకు వరంగా మారుతున్నాయి. ఓవైపు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వస్తామంటూనే, మరోవైపు సవాలక్ష షరతులు పెడుతున్నాయి. అలాగే రాయితీలు కూడా కోరుతున్నాయి. ఇవన్నీ ఇచ్చాక కూడా తమ లక్ష్యాలు నెరవేరకపోతే కేటాయించిన భూములు రద్దు చేయొద్దంటూ ప్రభుత్వానికి షరతులు పెడుతున్నాయి. తాజాగా వైజాగ్ కు వచ్చిన కాగ్నిజెంట్ సంస్థ ఇదే చేసింది.

విశాఖలో కాగ్నిజెంట్ ప్రస్తుతానికి ఓ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. ఇందులో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. అలాగే శాశ్వత కార్యాలయం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి విజ్ఢప్తి చేసుకుంటే కాపులుప్పాడలో 22.19 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ శాశ్వత కార్యాలయం నిర్మాణానికి సీఎం చంద్రబాబు తాజాగా శంఖుస్థాపన చేశారు. ఈ క్యాంపస్ ను 8వేల మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో నిర్మించాల్సి ఉంది.

AP Government Waives Unilateral Land Cancellation Clause for Cognizant s Vizag Tech Park

2033 నాటికి 3 దశల్లో రూ.1,583 కోట్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఇందులో 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది. అయితే కాగ్నిజెంట్ తాజాగా భూమిపూజ సమయంలో ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ఒప్పందం ప్రకారం తమ సంస్థ నిర్ణీత లక్ష్యాలను (క్యాంపస్ నిర్మాణం, ఉద్యోగాల కల్పన) గడువు లోపు అందుకోలేకపోతే ఏకపక్షంగా ఎంఓయూ రద్దు చేయకూడదని కోరింది.

AP Government Waives Unilateral Land Cancellation Clause for Cognizant s Vizag Tech Park

గడువులోపు నిర్మాణం పూర్తి కాక, ఉద్యోగాలు కల్పించలేకపోయినా అందుకు దారితీసిన పరిస్ధితులు, కారణాలు తెలుసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని, అలాగే ఏదైనా అంశంలో ప్రభుత్వానికీ, తమకూ ఏకాభిప్రాయం కుదరకపోతే మధ్యవర్తిత్వానికి వెళ్లేందుకు అనుమతి ఉండాలంటూ కోరింది. దీంతో ప్రభుత్వం కూడా చేసేది లేక అందుకు సమ్మతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న సంస్థల డిమాండ్లను తెరపైకి తెచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+