ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే-25 లక్షల మంది రెడీ..!
ఏపీలో వర్క్ ఫ్రమ్ హోం (ఇంటి వద్ద నుంచే పని) సంస్కృతిని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ముందు ఎంత మంది ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కు సిద్దంగా ఉన్నారనే అంశాన్ని తెలుసుకునేందుకు తాజాగా ప్రభుత్వం ఓ సర్వే ప్రారంభించింది. ఇందులో వ్యక్తమయ్యే అభిప్రాయాల ఆధారంగా రాష్ట్రంలోని పలు శాఖల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రంలో తగిన సదుపాయాలు కల్పిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఇష్టంగా ఉన్నారా లేదా అనే అంశంపై ప్రస్తుతం సర్వే జరుగుతోంది. ఇందులో ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఇతర విద్యార్హతలు కలిగిన 18 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారిపై సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు 25 లక్షల మంది యువతీ యువకులు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ వివరాలను కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబుకు సమర్పించారు.

రాష్ట్రంలో 2.68 కోట్ల మంది ఇలా 18-50 ఏళ్ల మధ్య వారు ఉండగా. వీరిలో దాదాపు కోటి మందిపై సర్వే పూర్తయింది. ఇందులో 11 లక్షల మందికి పైగా ఇంటర్ చదివిన వారు, 13 లక్షలకు పైగా డిప్లమో, అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్న వారు ఉన్నారు. వీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించేందుకు 118 ప్రభుత్వ భవనాలను కూడా గుర్తించారు. అలాగే ఇప్పటికే 2.13 లక్షల మంది హైదరాబాద్, బెంగళూరులోని ఐటీ కంపెనీల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్నట్లు కూడా సర్వేలో గుర్తించారు. త్వరలో సర్వే పూర్తి చేశాక ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
-
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications