ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌లో కరోనా వైరస్ లక్షణాలు: రాజ్‌భవన్ ప్రకటన

అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బిశ్వభూషణ్ హరిచందన్‌లో స్వల్పంగా కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. బిశ్వభూషణ్ హరిచందన్ ఇదివరకే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. అయినప్పటికీ- ఆయనలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆయన జ్వరం, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్నారని సమాచారం. ఈ ఉదయం గవర్నర్ అనారోగ్యానికి గురయ్యారు.

AP Governor Biswa Bhusan Harichandan admitted to Hospital after showed Covid19 symptoms

రాజ్‌భవన్ అధికారులు వెంటనే ఆయనను హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయన వెంట భార్య సుప్రవ హరిచందన్ ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో గవర్నర్‌ను ప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డులో ఉంచి, డాక్టర్లు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. కొద్దిరోజుల కిందటే గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు.

వృత్తిరీత్యా హరిచందన్ న్యాయవాది. జనతాదళ్‌లో చేరడంతో ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. 1996లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అయిదు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీ-బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. కీలకమైన రెవెన్యూ, న్యాయ, మత్స్యాభివృద్ధి శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆయనను ఏపీకి గవర్నర్‌గా పంపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+