'అన్నదాత సుఖీభవ' లబ్దిదారుల నమోదు, చివరి తేదీ, అర్హతలు..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల అమలు కసరత్తు కొనసాగుతోంది. రైతులకు ప్రతీ ఏటా రూ 20 వేలు ఆర్దిక సాయం అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ పథకం అమలు పైన మార్గదర్శకాలు సిద్దం అయ్యాయి. ఈ నెలలోనే తొలి విడత నిధుల విడుదలకు నిర్ణయించారు. ఇందు కోసం లబ్దిదారులు తమ వివరాల నమోదు తో పాటుగా చివరి తేదీ.. అదే సమయంలో అర్హతలను ఖరారు చేసారు.

నమోదు కోసం
అన్నదాత సుఖీభవ పథకం అమలు దిశగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. పథకానికి అర్హత ఉన్న రైతులు రైతు సేవా కేంద్రంలో ఈనెల 20వ తేదీలోగా వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో పాటుగా రైతులకు మూడు విడతల్లో ఈ పథకం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్రం ఇచ్చే రూ 6 వేలను మినహాయించి మిగిలిన రూ 14 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌కు ముందే ఈ సాయాన్ని అందించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా చర్యలు సైతం మొదలు పెట్టింది.

ap-govt-announces-key-guide-lines-for-annadata-sukhibava-implementation

అర్హతలు
అన్నదాత సుఖీభవం పథకానికి ప్రజా ప్రతినిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్​కమ్ ట్యాక్స్ చెల్లించేవారికి ఈ పథకం వర్తించదు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుంది. ఇందుకోసం రైతుసేవా కేంద్రాల వారీగా వెబ్‌ల్యాండ్‌ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు మండల వ్యవసాయ అధికారి లాగిన్లకు ఇచ్చారు. వెబ్‌ల్యాండ్‌లో సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం రైతు సేవాకేంద్రాల్లో పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయాధికారి లాగిన్‌కు ఆ వివరాలను పంపిస్తారు. ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారికి వివరాలు వెళ్తాయి. వెబ్‌ల్యాండ్‌లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి లిస్ట్ నుంచి తొలగిస్తారు.

20వ తేదీ లోగా
అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతు సేవా కేంద్రంలో ఈనెల 20లోగా వివరాలను నమోదు చేసుకోవాలి. జిల్లా స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్‌ల్యాండ్‌ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పింపిస్తారు. అక్కడ నుంచి ఆర్‌జీఎస్‌కు పంపిన తరువాత, ప్రభుత్వ గైడ్​లైన్స్ ప్రకారం ఆధార్‌ అనుసంధానంగా అనర్హులను గుర్తిస్తారు. అనంతరం ఫైనల్ జాబితాను మళ్లీ రైతు సేవా కేంద్రాలకు పంపుతారు. అందులోని లబ్ధిదారులందరితో సంబంధిత అధికారులు ఈ-కేవైసీ చేపిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+