Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాఠశాలలకు సంక్రాంతి సెలవులు, తాజా ఉత్తర్వులు: ఏపీ, తెలంగాణలో ఇలా..!!

విద్యార్ధులకు బిగ్ అప్డేట్. సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే సంక్రాంతి పండుగ సెలవుల పైన విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే 2026 అకడమిక్ క్యాలెండర్ ను ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్ సైతం విడుదల చేసింది. ఇక, సంక్రాంతి సెలవుల పైనా స్పష్టత ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.

సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. సొంత గ్రామాలకు వెళ్లి ఈ పండుగను జరుపు కుంటారు. దీంతో, ఈ పండుగ సెలవులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఇప్పటికే సంక్రాంతి సెలవుల తేదీలను నిర్ధారించింది. జనవరి 10 నుండి జనవరి 18, 2026 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని ప్రకటించింది. మొత్తం 9 రోజులు సెలవులు ఉంటాయి. జనవరి 19, 2026న తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి. తెలంగాణలో ప్రభుత్వం ఇదే విధంగా సెలవులను ఖరారు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో జనవరి 10 నుండి జనవరి 15, 2026 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చేందుకు తొలుత ప్రతిపాదనలు చేసారు. అయితే, ఇప్పుడు ఏపీ తరహాలోనే సెలవుల పైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

ap-govt-announces-sankranti-holidays-for-all-schools-in-the-state-details-here

సెలవుల అనంతరం సిలబస్ ప్రకారం తరగతులు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షలు, అకడమిక్ క్యాలెండర్‌లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. సంక్రాంతి పండగలకు ఊళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్స్‌ చేస్తారు. రైల్వే, ఆర్టీసీ సైతం సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో.. ముందస్తుగా రైళ్లు, బస్సు టికెట్స్‌ను బుక్‌ చేసుకుంటున్నారు. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వర్తిస్తాయి. అదనంగా పాఠశాలలు జనవరి 23న వసంత పంచమి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవులు ఉన్నాయి. జనవరి 14న భోగి, జనవరి 15న సంక్రాంతి, జనవరి 16న కనుమ. జనవరి 17, 2026న ముక్కనుమ ఇలా వరుసగా పండగను జరుపుకుంటారు. ఇందుకు అనుగుణంగా సెలవులు ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+