పేదలకు ఇళ్లు పై కీలక నిర్ణయం - వీరికి నో ఛాన్స్..!!

ఏపీ ప్రభుత్వం పేదలకు గృహ నిర్మాణం పై కసరత్తు వేగవంతం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముందకు వెళ్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పిఎంఎవై 2.0) కింద గృహాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ పథకం కింద అర్బన్‌, పిఎంఎవై గ్రామీణ్‌ కింద గ్రామాల్లో ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి అర్హులను గుర్తించేందుకు ఇంటిటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

కసరత్తు
ఏపీలో ఇళ్లు లేని పేదలు సుమారు 10 నుంచి 12 లక్షల వరకు ఉండొచ్చని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అర్బన్‌, పిఎంఎవై గ్రామీణ్‌ కింద గ్రామాల్లో ఇళ్లు నిర్మించేలా కసరత్తు జరుగుతోంది. ఈ పథకాన్ని 60:40 నిష్పత్తిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక డిజైన్‌ చేసింది. గతంలో ఇళ్లు మంజూరైన వారు, ప్రభుత్వ పరంగా లబ్ధి పొందినవారు, దారిద్య్ర రేఖకు ఎగువున ఉన్న వారు గృహ నిర్మాణశాఖ నూతనంగా తేనున్న 2.0 పథకానికి అనర్హులుగా అధికారులు పేర్కొంటున్నారు. గృహాల నిర్మాణ విలువ ఖరారు పైన కసరత్తు జరుగుతోంది.

AP Govt begin exercise on Housing Scheme for poor with latest tarrifs

ఇంటింటి సర్వే
ప్రభుత్వం తాజాగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన 2.0 యూనిట్‌ కింద నిర్మించనున్న గృహాల నిర్మాణ విలువను ఇప్పుడు అమల్లో ఉన్న రూ.1.80 లక్షలు కాకుండా అర్బన్‌లో యూనిట్‌ కాస్ట్‌ను రూ.4.30 లక్షలకు పెంచారు. అర్బన్‌లో నిర్మించే ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.2.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.1.80 లక్షలు చెల్లించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లను పిఎంఎవై గ్రామీణ్‌ కింద ఒక్కో యూనిట్‌ విలువ రూ.2.10 లక్ష్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.1.08 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.72 వేలుగా ఉంటుంది.

హడ్కో రుణాలు
దీంతో పాటుగా ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌/ఎస్‌బిఎమ్‌ కన్వర్జెన్స్‌ కింద మరో రూ.30 వేలు ఇవ్వనున్నారు. ఇంటింటి సర్వే పూర్తికాగానే ఆయా లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌ (ఎంఐజి), లోయిస్ట్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌(ఎల్‌ఐజి) వర్గాలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులకు భారంగా మారకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం హడ్కో ద్వారా రుణాలు ఇప్పించనుంది. వీటి పైన త్వరలోనే మార్గదర్శకాలు జారీ కానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+