ఏపీలో రైతు భరోసా అమలు అప్పుడే - తాజా లెక్కలతో..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ వెబ్ సైట్‌లో మార్పులు చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని 2019లోనే చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.20వేలు అందిస్తామని టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 'సూపర్‌సిక్స్‌'లో ప్రకటించారు. అయితే, ఈ పథకం అమలు ఎప్పుడు. ప్రభుత్వంలో ఏం జరుగుతోంది.

ప్రభుత్వ సాయం కోసం
రైతులకు ప్రతిఏటా రూ.20 వేలు సాయం చేస్తామన్న టిడిపి కూటమి ఎన్నికల హామీ సందిగ్ధంలో పడింది. మరో నాలుగు నెలలకు పభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ తెచ్చిన నేపథ్యంలో ఈ పథకం అమలు ఎప్పుడు చేస్తారనేది స్పష్టత రావటం లేదు. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌ మాసాలకు నిధుల ఖర్చు నిమిత్తం సర్కారు ఆర్డినెన్స్‌ ద్వారా ఆమోదం తీసుకున్నందున నవంబర్‌ లోపు రైతులకు చేస్తామన్న సాయం అందే అవకాశం లేదని తెలుస్తోంది. పోనీ పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాకనైనా ఈ ఏడాదిలో రైతులకు సాయం చేస్తారా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.

AP Govt begin exercise on implementation of Annadatha Sukhibava scheme as Election promise

ఆర్దిక సమస్యలతో
ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో..బయటా తాము హామీలు ఇచ్చామని..కానీ, ఖజానా లో నిధులు లేవని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అన్నదాతలకు సాయం ఇప్పుడప్పుడే కాదని అర్థమవుతోందని ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ మధ్యలోకొచ్చింది. సెప్టెంబర్‌ నెలాఖరుతో పంటల సాగుకు సమయం ముగుస్తుంది. వైపు భారీ వర్షాలు, వరదల వలన సాగైన పంటలు నీటిపాలయ్యాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అసెంబ్లీలో సిఎం ప్రకటించారు. నష్టపరిహారంపై (ఇన్‌పుట్‌ సబ్సిడీ) ఇంకా ప్రభుత్వంలో కదలిక లేదు.

అమలు అప్పుడేనా
మరోవైపు 2022-23 రబీ, 2023 ఖరీఫ్‌, 2023-24 రబీ పంటల బీమా క్లెయిములు పెండింగ్‌లో ఉన్నాయి. పంట రుణాలపై 'సున్నా వడ్డీ' రీయింబర్స్‌మెంట్‌ అలాగే ఉంది. బ్యాంకులు రైతులకు రుణాలివ్వట్లేదు. కౌలు రైతులకైతే ఆ వసతులు అసలే లేవు. దాంతో రైతులు ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం వెతుకులాటలో ఉన్నారు. ప్రభుత్వం అందిస్తామన్న సాయం రూ.20 వేల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

రైతులకు చేస్తామన్న సాయంపై ఇప్పటి వరకు ప్రభుత్వంలో కనీసమాత్రపు చర్చ లేదు. కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్‌తో కలిపా, కలపకుండానా, కౌలు రైతులకు ఇస్తారా లేదా అనేదానిపై ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తేనే స్పష్టత వస్తుంది. అన్నీ చూసుకొని రానున్న జనవరిలో, సంక్రాంతికి కొంచెం అటూ ఇటూగా రైతు సాయం విడుదల చేస్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+