ఏపీ కేబినెట్ లోకి కొత్త మంత్రి - శాఖ ఖరారు, తాజా నిర్ణయంతో...!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం పాలనలో.. రాజకీయంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ లక్ష్యంగా కొత్త వ్యూహాలతో అడుగులు వేస్తోంది. తాజాగా లడ్డూ వివాదంలో ఏక సభ్య కమిషన్ నియమించిన ప్రభుత్వం.. ఇక, ఇప్పుడు ప్రభుత్వంలో కీలక మార్పులకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త శాఖ రూపకల్పన చేస్తూ మంత్రివర్గంలో ఆమోదించారు. ఈ శాఖ ను కొత్త మంత్రికి అప్పగించేలా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వంలో కీలక నిర్ణయాల దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావాస్తున్న వేళ మంత్రుల పని తీరు పైన నివేదికలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే పలు సంద ర్భాల్లో సీఎం చంద్రబాబు మంత్రులు పాలనా పరంగా - పార్టీ వ్యవహారాల్లో ఏ స్థాయిలో పని చేస్తు న్నారో క్షేత్ర స్థాయి నుంచి సేకరించిన వివరాలను బయట పెట్టారు. పని తీరు మెరుగు పర్చుకోవా లని సూచించారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా.. కొందరు మంత్రుల పని తీరు పైన ఇంకా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి సానుకూల అభిప్రాయంతో లేరని తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ పైన కొంత కాలంగా ప్రచారం సాగుతున్నా... పని తీరు మెరుగు పర్చుకొనేందుకు మంత్రులకు ముఖ్యమంత్రి సమయం ఇస్తూ వచ్చారు. కాగా.. ఇక, కేబినెట్ లో అవసరమైన మార్పులు చేసే అవకాశం కనిపిస్తుందనే చర్చ ప్రభుత్వంలో వినిపిస్తోంది.

పాలనా పరంగా కీలక నిర్ణయాలు
తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు చేస్తూ నిర్ణయం చేసారు. ఈ మేరకు సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇన్నోవేషన్‌తో కలిసి కొత్త శాఖగా ఆమోదించారు. అయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ వద్ద ఉంది. దీనికి అదనంగా ఇన్నోవేషన్ శాఖ జత చేసారు. పవన్ తన వద్ద ఉన్న శాఖల్లో ప్రధానంగా పంచాయితీ రాజ్, అటవీ శాఖ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా.. మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ కేబినెట్ లో అవకాశం ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించి చాలా రోజులు అవుతోంది. ఎమ్మెల్సీ గానూ నాగబాబు కు అవకాశం దక్కింది. అయితే, ఇప్పుడు ఈ కొత్త శాఖ పవన్ వద్దే కొనసాగిస్తారా లేక, ఆయన నుంచి సోదరుడు నాగబాబుకు అప్పగించి.. ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం ఇస్తారా అనే సమీకరణాల పైన ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తరువాత కేబినెట్ విస్తరణ, మార్పులు - చేర్పుల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
-
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications