సచివాలయ సిబ్బంది ప్రొబేషన్ - ముహూర్తం ఫిక్స్ : 1,17,954 మందికి లబ్ది..!!

గ్రామ - వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రొబేషనరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ఈ నెల 10వ తేదీన ప్రొబేషన్‌ ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ అంశం పైన జరిపిన చర్చల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం అమలుకు ముందుకొచ్చారు. అందులో భాగంగా.. జూలై ఒకటవ తేది నుండి పే స్కేలు వర్తింపచేయాలని కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి అధికారిక కసరత్తు జరుగుతోంది.

లక్షా 18 వేల మందికి ప్రయోజనం

లక్షా 18 వేల మందికి ప్రయోజనం


గత అక్టోబర్ లోనే దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చారు. కానీ, పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దీనికి సంబంధించి వచ్చే వారంలో అధికారికంగా ప్రకటన చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ప్రొబేషన్ ప్రకటన చేయటం ద్వారా 1,17,954 మందికి లబ్ది జరగనుంది. ప్రొబేషన్ ప్రకటన వాయిదా పడుతూ వస్తున్న సమయంలోనే..సిబ్బంది నుంచి ఒత్తిడి సైతం పెరుగుతోంది. పదో తేదీన ప్రొబేషన్ ప్రకటనకు సంబంధించి కసరత్తులో భాగంగా..జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు. అవసరమైన చర్యల దిశగా సూచనలు చేసారు.

అర్హత సాధించిన వారి జాబితాలు సిద్దం

అర్హత సాధించిన వారి జాబితాలు సిద్దం

డిపార్ట్ మెంటల్ పరీక్షల్లో అర్హత సాధించిన వారితో పాటుగా నిరంతరాయంగా రెండేళ్ల పాటు పని చేసిన వారికి ప్రొబేషన్ ప్రకటించనున్నారు. ఇక, ఏపీపీఎస్సీ ద్వారా శాఖాపరమైన పరీక్షలు నిర్వహించిన ఎఎన్‌ఎం ఉద్యోగస్తులకు కూడా ప్రొబేషన్‌ ప్రకటించే అంశం పైన పరీశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన ఫలితాల్లో 12,901 మంది ఉత్తీర్ణత సాధించారు. సచివాలయాల్లో పని చేస్తున్న 14,483 మంది మహిళా పోలీసులు కూడా అర్హత సాధించారు. వీరికి కూడా ప్రొబేషన్‌ ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచిస్తూ ఉన్నతాధికారుల నుంచి సమాచారం పంపారు.

ప్రభుత్వ హామీ అమల్లో భాగంగా..

ప్రభుత్వ హామీ అమల్లో భాగంగా..


దీంతో..ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. దీని ద్వారా లక్షా 18 వేల మంది వరకు రెగ్యులర్ ఉద్యోగులుగా మారనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా మారిన సచివాలయ వ్యవస్థలో ఇప్పుడు ప్రొబేషన్ ప్రకటన ద్వారా సేవలను మరింతగా ప్రజలకు దగ్గర చేసేందుకు వీలుగా ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+