ఏపీలో బడులకు మరో మూడు రోజుల సంక్రాంతి సెలవుల పొడిగింపు...!!
ఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుతెకుంది. ముందుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. దీంతో, జనవరి 22న (సోమవారం) తిరిగి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 11వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే దీనిపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గతంలో కనీసం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చేవారని.. ఇప్పుడు మారిన పరిస్థితులరీత్యా సెలవులు తగ్గించడం సరికాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు నిర్ణయించింది.

19వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని పేర్కొంది. అయితే పండుగ అయిపోయన వెంటనే పిల్లలు పాఠశాలకు రాలేరని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు రావడంతో మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ.. తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, ఈ నెల 22న ఏపీలో విద్యా సంస్థలు రీ ఓపెన్ కానున్నాయి.












Click it and Unblock the Notifications