మధ్యాహ్న భోజనం లో మార్పులు - జిల్లాల వారీగా, ఇక ఇలా..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థలో మార్పుల దిశగా కసరత్తు చేస్తోంది. జగన్ హయాంలో విద్యార్ధులకు అమలు చేసిన మధ్యాహ్న భోజన పథకం మెనూ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇప్పుడు జగన్ ను పూర్తిగా మరిపిస్తూ.. గతం కంటే మెరుగ్గా మెనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం ఖరారు చేసిన కొత్త మెనూ తో జోన్ల వారీగా అమలు కు ప్రభుత్వం సిద్దమైంది. ఏ రోజు ఏ మెనూ అమలు చేయాలో డిసైడ్ అయింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యార్ధులకు అందించే మెనూ లో మార్పులు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గా పేరు మార్చింది. ఇప్పుడు మోనూ అమలు విషయంలోనూ జిల్లాల వారీగా ఖరారు చేసింది. సంక్రాంతి సెలవుల తరువాత కొత్త మెనూ బడుల్లో అమలు కానుంది. ఇక ప్రతీ మంగళవారం మాత్రం రెండు మెనూలు అమలు కానున్నాయి.

మెనూ అమలు విషయంలో 13 జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించారు. జోన్-1లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉండగా జోన్-2లో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. జోన్-3లో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఉన్నాయి. జోన్-4లో చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. జూనియర్ కాలేజీల్లో మరో విధంగా మెనూ అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ సోమవారం జోన్ 1 పరిధిలో ఇక నుంచి అన్నం, ఆకుకూరతో పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ ఇస్తారు. జోన్ 2లో అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ ఇవ్వనున్నారు. మంగళవారం జోన్ -1 లోఅన్నం, గుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ ఇస్తారు. జోన్-2లో పులిహోర, చట్నీ, ఉడికించిన గుడ్డు, రాగిజావ ఇవ్వనున్నారు.
ప్రతీ బుధవారం జోన్ 1 లో వెజ్పలావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ ఇవ్వను న్నారు. జోన్ 2 లోఅన్నం, కూరగాయల కూర, గుడ్డు ఫ్రై, చిక్కీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా గురువారం జోన్ -1లో అన్నం, సాంబారు, గుడ్డుకూర, రాగిజావ ఇస్తారు. జోన్ లో వెజ్ రైస్/పులావ్, బంగాళ దుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ మెనూగా నిర్ణయించారు. ప్రతీ
శుక్రవారం పులిహోర, చట్నీ (గోంగూర, కూరగాయలు), ఉడికించిన గుడ్డు, చిక్కీ ఉంటుంది. జోన్ 2 లో అన్నం, ఆకుకూరలతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ ఇవ్వనున్నారు. ఇక, శనివారం తెల్ల అన్నం, కూరగాయల కూర, రసం, రాగిజావ, స్వీట్ పొంగల్ ఉంటుంది. జోన్2 లో అన్నం, కూరగాయల కూర,స్వీట్ పొంగల్, రాగి జావ ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications