కల్తీ మద్యం ఘటనతో అలర్ట్- షాపులు, బార్లకు ఏపీ సర్కార్ కొత్త రూల్స్ .!

ఏపీలో అన్నమయ్య జిల్లాలో బయటపడిన కల్తీ మద్యం తయారీ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ నేతల్ని పార్టీ సస్పెండ్ చేయడంతో విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు అవకాశం లభించింది. ఆ తర్వాత ప్రభుత్వమే కల్తీ మద్యం కేసులో తవ్వేకొద్దీ షాకింగ్ వాస్తవాలు బయటికొస్తున్నందున సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సర్కార్ ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు వీలుగా ఎక్సైజ్ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బార్లు, దుకాణాల్లో నాణ్యమైన మద్యం మాత్రమే అమ్మాలని సూచించింది. ఎక్సైజ్ శాఖ సురక్షా యాప్ తో మద్యం బాటిళ్లపై కోడ్ స్కాన్ చేయాలని ఆదేశించింది. అమ్ముతున్నది నాణ్యమైన మద్యమేనని నిర్ధారించినట్లు షాపులు, బార్ల దగ్గర బోర్డులు పెట్టాలని ఆదేశించింది. అలాగే మద్యం బాటిళ్లపై సీల్, క్యాప్, హోలోగ్రామ్ చెక్ చేయాలని సూచించింది.

AP Govt Issues Key Orders to Curb Spurious Liquor After Recent Tragedy

రాష్ట్రంలోని ప్రతీ మద్యం దుకాణం, బార్ లో డైలీ మద్యం రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించింది. ఎక్సైజ్ సిబ్బంది మద్యం దుకాణాల్లో విస్తృత తనిఖీలు చేయాలని తెలిపింది. ఇలా చేసిన తనిఖీల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించింది. మద్యం డిపోల నుంచి అందిన మద్యం సీసాల్లో కనీసం 5 శాతం బాటిల్స్ స్కాన్ చేయాలని కోరింది. ఎక్కడైనా నకిలీ మద్యం గుర్తిస్తే వెంటనే ఎక్సైజ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని సూచించింది.

AP Govt Issues Key Orders to Curb Spurious Liquor After Recent Tragedy

అలాగే నకిలీ మద్యం దొరికితే సదరు షాపు లేదా బార్ లైసెన్స్ రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పాటు నకిలీ మద్యంపై ఫిర్యాదులకు పర్యవేక్షణ ఉండేలా ఓ వ్యవస్థ అందుబాటులోకి తేవాలని కోరింది. వీటిలో వచ్చే ఫిర్యాదుల్ని 24 గంటల్లో విచారించి పరిష్కరించాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+