సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన..!!
సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలకు రంగం సిద్దం అవుతోంది. ఏపిలో స్కూళ్ళుకు ఎల్లుండి నుంచి పది రోజులు సెలవులు సెలవులు ప్రకించింది. సెలవుల అనంతరం 19వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సంక్రాంతి సెలవుల పైన ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 9 నుంచి 18 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సారి జనవరి 13న రెండో శనివారం, జనవరి 14 ఆదివారం భోగి పండుగ, జనవరి 15 సోమవారం సంక్రాంతి) పండుగ జరుపుకోనున్నారు. కాగా, 18 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ముందు జనవరి 16 మంగళవారం వరకే సెలవులు ఉంటాయని భావించిన పాఠశాల, కళాశాల యజమాన్యాలు మరో రెండు రోజుల పాటు అదనంగా సెలవులు ప్రకటించింది.

తెలంగాణలో కూడా సంక్రాంతి సెలవులను 9 నుంచి 16 వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో ఉద్యోగాల రీత్యా తెలంగాణలో ఉంటున్న వారు ఇప్పటికే సొంతూర్లకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు పండుగ సెలవుల్లో కూడా ఓపెన్ అవుతుంటాయి. పరీక్షల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి పెంచుతుంటాయి. అలాంటి పనులు చేస్తే ఊరుకునేది లేదనీ, సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. దీంతో, వచ్చే వారం నుంచి సంక్రాంతి శోభతో గ్రామాల్లో పండుగ సందడి ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications