ట్రాఫిక్ చలానాలు, ఎఫ్‌ఐఆర్ ఇక నుంచి - ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సేవలను సులభతరం చేసింది. సంక్రాంతి తరువాత అన్ని రకాల పౌర సేవలు వాట్సప్ గవర్నెన్స్ లోకి వచ్చే విధంగా నిర్ణయించింది. తాజాగా మరికొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. పోలీసు సేవలను సైతం వాట్సప్ గవర్నెన్స్ లోకి తెచ్చింది. ఎఫ్‌ఐఆర్ నుంచి ట్రాఫిక్ చలాన్ల వరకు అన్నీ వాట్సప్ ద్వారానే పొందవచ్చు.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సప్ గవర్నెన్స్ లో కొత్తగా పోలీసు శాఖ నుంచి అందుతున్న పౌర సేవలను చేర్చారు. ఎఫ్ఐఆర్ స్టేటస్, ఈ చాలాన్లను ఇందులో చెక్ చేసుకోవచ్చు. వాట్సప్ నుంచి చలాన్లను ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఇక పోలీస్ చలాన్లతో పాటు రవాణాశాఖ చలాన్లు అన్నీ ఒకేచోట కనిపిస్తున్నాయి. దీని వల్ల తమ మొబైల్ యాప్ ద్వారానే వీటిని చెల్లించే అవకాశం అందుబాబులోకి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం ఆదాయం, రెసిడెన్షియల్, కులం లాంటి ప్రభుత్వ సర్టిఫికేట్లతో పాటు ఆర్టీసీ, దేవాలయాల్లో దర్శనం టికెట్లు బుకింగ్ లాంటివి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పొందే అవకాశం కల్పించింది. ఇప్పుడు ఈ సేవల పరిధిని విస్తరిస్తూ తాజా సేవలను అందులో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ సేవల వినియోగం పైన అధికారులు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 95523 00009 నంబరును ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో పోలీసు సేవలు కావాల్సిన వారు..మెనూలో పోలీస్ శాఖ సేవలను సెలక్ట్ చేసుకోవాలి. ఎఫ్‌ఐఆర్, ఎఫ్‌ఐఆర్ స్టేటస్, ఈ చలాన్లు అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో కావాల్సిన వాటిని సెలక్ట్ చేసుకోవాలి. చలాన్ చెల్లించాలంటే మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ బండిపై ఉన్న చలాన్ల వివరాలు కనిపిస్తాయి. బ్యాంకు ద్వారా చెల్లించి రసీదు పొందే విధంగా ఇందులో సదుపాయం కల్పించారు. దీని ద్వారా ఏ కార్యలయాల కు వెళ్లే అవసరం లేకుండా ప్రభుత్వం ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications