ఏపీలో స్లీపర్ బస్సుల రద్ధు? సర్కార్ సంకేతాలు..!

ఏపీలో ఈ మధ్య వరుసగా ప్రైవేటు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో చాలా వరకూ స్లీపర్ బస్సులే (sleeper bus) ఉంటున్నాయి. రోడ్లపై జరిగే ప్రమాదాలతో పాటు బస్సుల్లో ఉన్న ఫిట్ నెస్, ఇతర సమస్యలే ఇందుకు కారణమవుతున్నాయి. ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణిస్తున్న జనం బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీంతో స్లీపర్ బస్సుల నిషేధం దిశగా ఏపీ సర్కార్ (ap govt) అడుగులు వేయబోతోంది.

రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న స్లీపర్ బస్సుల ప్రమాదాల నేపథ్యంలో భవిష్యత్తులో వీటిని రద్దు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు, ఈ మేరకు కేంద్రాన్ని సంప్రదించినట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అలాగే బస్సుల వేగాన్ని నియంత్రించేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం బస్సు ప్రయాణించే దూరం ఆధారంగా గమ్యానికి చేరే సమయాన్ని కూడా నిర్ణయించి, అంతకంటే తక్కువ సమయంలో చేరితే సిటీలోకి అనుమతించబోమని ఆయన తెలిపారు.

AP Govt Pushes for Sleeper Bus Ban Following Deadly Fire Accidents

అలాగే 300 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చూస్తామని, వీరిలో ఒకరు రాత్రిపూట డ్రైవర్ నిద్రపోయేందుకు వీలుగా బస్సులో ఓ సీటు కూడా కేటాయించేలా ప్రైవేటు ఆపరేటర్లను ఆదేశించారు. దీంతో పాటు జాతీయ రహదారులపై బస్సుల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్ ల ఏర్పాటు కోసం రూ.40 కోట్లు కేటాయించారు. అలాగే బస్సుల్లో రెండు కెమెరాలు ఏర్పాటు చేసి డ్రైవర్ తో పాటు ఎదురుగా వచ్చే వాహనాలను గమనించేలా చూడాలని నిర్ణయించారు. ఇప్పటికే కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత 50 బస్సులు సీజ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+