Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..!

ఏపీలో ప్రభుత్వం (ap govt) ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న పేదల ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్దమైంది. గతేడాది నుంచీ ఉగాదికి ఇళ్ల పంపిణీ చేపడతామంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం.. సకాలంలో వాటిని సిద్దం చేయలేకపోయింది. దీంతో ఇవాళ 2.5 లక్షల ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఇవాళ జరిగే ఓ కార్యక్రమంలో వీటిని లబ్దిదారులకు అందజేయబోతున్నారు.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..!
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..!

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం ఆవాస్ యోజన పథకం సాయంతో ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్లు, అలాగే టిడ్కో పథకం కింద నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం ఇవాళ లబ్దిదారులకు పంపిణీ చేయబోతోంది. వీటి కోసం లబ్దిదారులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టిడ్కో ఇళ్లను దాదాపుగా పూర్తి చేసినా ప్రభుత్వం మారడంతో వాటిలో చాలా వరకూ నిలిచిపోయాయి. తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు మొదలుపెట్టి పూర్తి చేసింది.. ఇలా పూర్తి చేసిన లక్ష టిడ్కో ఇళ్లతో పాటు కాలనీల్లో నిర్మించిన మరో 1.5 లక్షల ఇళ్లు కలుపుకుని మొత్తం 2.5 లక్షల ఇళ్లను ఇవాళ పంపిణీ చేయబోతున్నారు.

AP Govt to Hand Over 2 5 Lakh Houses to Poor Families Today
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..!
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం, పంపిణీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తొలి ఏడాదే 3 లక్షల ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఇప్పుడు మరో 2.5 లక్షల ఇళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ లెక్కన 21 నెలల కూటమి పాలనలో 5.5 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్లు పంపిణీ చేసినట్లు అవుతోంది. మరోవైపు టిడ్కో లబ్దిదారుల నుంచి గతంలో డబ్బులు వసూలు చేసి ఇళ్లు పూర్తి చేయలేకపోయిన వారికి సదరు మొత్తాల్ని తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి వారికి డబ్బులు వెనక్కి రాబోతున్నాయి. అర్హులైన మిగిలిన వారికి మాత్రం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇవ్వబోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+